Chikungunya Vaccine: చికున్ గన్యా టీకాకు అమెరికాలో అనుమతి
Sakshi Education
చికున్ గన్యా జ్వరాల టీకాకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిన్‌స్ట్రేషన్ ఆమోదముద్ర వేసింది.
చికున్ గన్యా దోమల ద్వారా వ్యాప్తి చందే వ్యాధి. చికున్ గన్యా సోకిన వారికి జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు వస్తాయి. శిశువులకు ఈ వ్యాధి సోకితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. టీకాకు ఎఫ్‌డీఏ అనుమతులు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా దీనిని విడుదల చేయడానికి మార్గం సుగమమైంది.
Mouse Embryos in Space: అంతరిక్ష కేంద్రంలో ఎలుక పిండాల వృద్ధి
ఈ వ్యాక్సిన్‌కు ఇక్స్‌చిక్ అనే పేరుపెట్టారు. ఐరోపాకు చెందిన ‘వాల్నెవా’ కంపెనీ ఈ టీకాను తయారు చేసింది. దీనిని 18 ఏళ్ల వయస్సు దాటిన వారు మాత్రమే తీసుకోవాలి. ఈ టీకాకు సింగిల్ డోసు అవసరమవుతుంది.
Published date : 11 Nov 2023 10:25AM