Mouse Embryos in Space: అంతరిక్ష కేంద్రంలో ఎలుక పిండాల వృద్ధి
Sakshi Education
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఎలుక పిండాలను జపాన్ శాస్త్రవేత్తలు వృద్ధి చేశారు.
రోదసిలో మానవుల పునరుత్పత్తి సాధ్యపడుతుందా.. అనే కోణంలో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టామని వారు పేర్కొన్నారు. 2021 ఆగస్టులో ఓ రాకెట్ ద్వారా ఐఎస్‌ఎస్‌కు గడ్డకట్టిన స్థితిలో ఉన్న ఎలుక పిండాలను పంపారు. జపాన్ అంతరిక్ష సంస్థ (జాక్సా) బృందం, యమనాశి అడ్వాన్స్‌డ్ బయో టెక్నాలజీ సెంటర్ కు చెందిన ప్రొఫెసర్ తెరుహికో వకయమా ఆ పరిశోధనలో పాలుపంచుకున్నారు.
Published date : 10 Nov 2023 09:54AM