Vyommitra: అంతరిక్షంలోకి మహిళా రోబో ‘వ్యోమమిత్ర’
Sakshi Education
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మహిళా రోబో ‘వ్యోమిత్ర’ను అంతరిక్షంలోకి పంపనుంది.
ఈ సంవత్సరం అక్టోబర్‌లో గగన్‌యాన్ మిషన్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. గగన్‌యాన్ ప్రోగ్రాంలో భాగంగా చేపట్టిన మానవ రహిత అంతరిక్ష ప్రయోగంలో ఇది ఒక భాగమని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేందర్ సింగ్ అన్నారు.
అక్టోబర్ మొదటి, రెండో వారంలో గగన్‌యాన్ తొలి ట్రయల్ రన్‌ను ఇస్రో చేపట్టనుందని తెలిపారు. రెండో ప్రయోగంలో మహిళా రోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపనున్నారు. మనిషి లాగేనే అన్ని యాక్టివిటీస్‌ను నిర్వహించగలిగే ఈ రోబోను పంపించిన తరువాత అంతా సవ్యంగా ఉంటే ఇక వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించవచ్చన్నారు. భూమి పై నుంచి 400 మీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి గగన్‌యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను తీసుకెళ్లనున్నారని అన్నారు.
Iran Satellite Launch: మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఇరాన్..
Published date : 05 Feb 2024 06:36PM