Gaganyaan Mission: ఇస్రో ‘గగన్‌యాన్’ TV-D1 ప్రయోగం విజయవంతం
శనివారం ఉదయం శ్రీహరికోట నుంచి నింగిలోకి సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ దూసుకెళ్లగా.. క్రూ మాడ్యూల్ పారాచూట్‌ల సాయంతో కిందకు సురక్షితంగా ల్యాండ్(సముద్రంలోకి) అయ్యింది. గగన్‌యాన్‌లో వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహాక ప్రయోగం సక్సెస్ కావడం పట్ల.. ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.
ISRO TV-D1: గగన్‌యాన్‌కు ముందు నింగిలోకి టీవీ–డీ1
టీవీ-డీ1 ఎందుకంటే..
గగన్‌యాన్‌కు ముందు ఇస్రో 4 పరీక్షలు నిర్వహించాలనుకుంది. అందులో టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్(టీవీ-డీ1) మొదటిది. 2018లో ఇలాంటి పరీక్ష నిర్వహించినప్పటికీ అది పరిమితస్థాయిలోనే జరిగింది. ఈసారి దాదాపుగా పూర్తిస్థాయిలో సిద్ధమైన వ్యోమనౌకను పరీక్షిస్తున్నారు. దీని ఫలితాల ఆధారంగా ఇస్రో తదుపరి పరీక్షలకు సిద్ధమవుతుంది. ఇందులో క్రూ(వ్యోమగాముల) ఎస్కేప్ సిస్టమ్ సమర్థత, క్రూ మాడ్యూల్ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్ వ్యవస్థ పటిష్ఠతను పరిశీలిస్తుంది. అలాగే సాగర జలాల్లో పడే క్రూ మాడ్యూల్‌ను సేకరించి, తీరానికి చేర్చే కసరత్తునూ పరీక్షిస్తుంది.
ఎందుకు కీలకం అంటే..
వ్యోమగాములతో వెళ్లే రాకెట్‌లో ఏదైనా లోపం ఎదురైతే వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో.. వారు కూర్చొనే క్రూ మాడ్యూల్‌ను రాకెట్ నుంచి వేరు చేసి, సురక్షితంగా కిందకి తీసుకురావాలి. దీన్ని క్రూ ఎస్కేప్ సిస్టమ్(సీఈఎస్) అంటారు. అంటే.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వ్యవస్థ సమర్థతను ఇప్పుడు పరీక్షిస్తున్నారు. క్రూ మాడ్యూల్‌ను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్ వ్యవస్థలో పది పారాచూట్లు ఉంటాయి.
Gaganyaan Mission: అక్టోబర్ 21న గగన్‌యాన్
గన్‌యాన్ ఉద్దేశం..
గగన్‌యాన్‌లో ముగ్గురు వ్యోమగాముల్ని 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపాలన్నది ఇస్రో లక్ష్యం. మూడు రోజుల తర్వాత వారిని భూమికి రప్పిస్తుంది. 2025లో ఈ యాత్ర జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా ఇస్రో కసరత్తు చేస్తోంది.
నేటి పరీక్ష ఇలా జరిగింది..
టీవీ–డీ1 17 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లి రాకెట్ శిఖరభాగాన అమర్చిన క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టంను మళ్లీ కిందకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టడం ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. తాజా ప్రయోగంలో వాహకనౌక గమనం.. మానవసహిత గగన్‌యాన్ యాత్రను పోలి ఉంటుంది. అది 1.2 మ్యాక్ వేగం (సెకనుకు 400 మీటర్లు)తో దూసుకెళుతుంది. రాకెట్ నింగిలోకి బయల్దేరాక, అనూహ్య పరిస్థితుల్లో ప్రయోగాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితిని ఇస్రో శాస్త్రవేత్తలు అనుకరిస్తారు. ఇందుకోసం ‘అబార్ట్’ సంకేతాన్ని పంపుతారు.
రాకెట్ శిఖరభాగంలో అమర్చిన క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం భూమికి 17 కిలోమీటర్లు దూరంలో అంతరిక్షంలో వదిలిపెట్టిన తరువాత దానికి పైభాగంలో అమర్చిన 10 ప్యారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలో దించి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియను చేపడుతున్నారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కోస్టల్ నేవీ సిబ్బంది ఒక ప్రత్యేక బోట్‌లో వేచి ఉండి సముద్రంలో క్రూమాడ్యూల్ పడిన తరువాత దాన్ని సురక్షితంగా తీసుకొస్తారు. సింగిల్ స్టేజీతో (ఒకే దశతో) ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. 531.8 సెకన్లకు ప్రయోగాన్ని పూర్తి చేయనున్నారు.
ISRO plans to build space station: అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా ఇస్రో