ISRO TV-D1: గగన్‌యాన్‌కు ముందు నింగిలోకి టీవీ–డీ1
దీనిలో భాగంగా మొట్టమొదటి క్రూ మాడ్యూల్ సిస్టం (వ్యోమగాముల గది)తో కూడిన గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ (టీవీ–డీ1)ను శనివారం ఉదయం 7 గంటలకు నింగిలోకి పంపడానికి శాస్త్రవేత్తలు అంతా సిద్ధం చేశారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదికనుంచి ప్రయోగించనున్నారు. ఇప్పటికే పలు రకాల భూస్థిర పరీక్షలను నిర్వహించారు.
Gaganyaan Mission: అక్టోబర్ 21న గగన్‌యాన్
ఇందులోని మోటార్ల పనితీరును నిర్థారించుకున్నారు. ఎంఎస్‌టీలో టీవీ–డీ1 రాకెట్ అనుసంధానం పనులన్నీ పూర్తి చేశారు. ఈ టీవీ–డీ1 రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్ సిస్టంను భూమికి సుమారు 17 కిలో మీటర్ల దూరంలోని అంతరిక్షంలోకి పంపించి తిరిగి దాన్ని సురక్షితంగా తీసుకురావడమే ఈ ప్రయోగం ఉద్దేశం. రాకెట్ శిఖరభాగంలో అమర్చిన క్రూ మాడ్యూల్ సిస్టంను అంతరిక్షంలో వదిలిపెట్టిన తరువాత దానికి పైభాగంలో అమర్చిన 10 పారాచూట్ల సాయంతో శ్రీహరికోట తీరం నుంచి 10 కిలో మీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దించి.. నేవీ సాయంతో ప్రత్యేక బోట్‌లో అక్కడ నుంచి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియను చేపడుతున్నారు.
భవిష్యత్తులో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములను తిరిగి క్షేమంగా తీసుకువచ్చే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిర్వహించే ప్రయోగం ఇది అని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల ఓ సమావేశంలో తెలిపారు. గగన్‌యాన్ ప్రయోగం ఇప్పటికే ఒక రూపానికి వచ్చిందని, ఆ ప్రయోగంలో టీవీ–డీ1 మొట్టమొదటి అంకమని ఆయన చెప్పారు.
ISRO plans to build space station: అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా ఇస్రో
టీవీ–డీ1 ప్రయోగమిలా..
♦ టీవీ–డీ1 ప్రయోగాన్ని 531.8 సెకన్లకు పూర్తి చేయనున్నారు. 34.954 మీటర్లు పొడవు కలిగిన టీవీ–డీ1 రాకెట్ ప్రయోగ సమయంలో 44 టన్నుల బరువు ఉంటుంది.
♦ ప్రయోగం ప్రారంభమైన 60.6 సెకన్లకు టెక్నికల్ వెహికల్ నుంచి క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం విడిపోతుంది.
♦ 90.6 సెకన్లకు క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది.
♦ ఆ తరువాత 95.9 సెకన్లకు ఏసీఎస్ పారాచూట్ విచ్చుకుని క్రూమాడ్యూల్‌ను సురక్షితంగా భూమివైపుకు తీసుకొస్తుంది.
♦ 96.2 సెకన్లకు అపెక్స్ కవర్ విడిపోతుంది. 98.2 సెకన్లకు డ్రోగ్ పారాచూట్ విచ్చుకుంటుంది.
♦ 296.1 సెకన్ల తరువాత డ్రోగ్ పారాచూట్ విడిపోతుంది.
♦ 296.3 సెకన్లకు పైలట్ పారాచూట్ విచ్చుకుంటుంది.
♦ 296.5 సెకన్లకు మెయిన్ పారాచూట్ విచ్చుకుని క్రూమాడ్యూల్‌ను సురక్షితంగా భూమివైపునకు తీసుకొస్తుంది.
♦ 531.8 సెకన్లకు క్రూమాడ్యూల్ బంగాళాఖాతంలో దిగడంతో టీవీ–డీ1 ప్రయోగం పూర్తవుతుంది.