Skip to main content

ISRO: క్రూ మాడ్యూల్‌కు లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ను జతచేసిన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన గగన్‌యాన్‌–1 మిషన్ మానవసహిత అంతరిక్ష ప్రయోగాలకు మేనేజ్‌మెంట్‌లో పెద్ద పురోగతిని సూచిస్తుంది.
ISRO Dispatches Crew Module for First Uncrewed Mission Of Gaganyaan

సంక్షిష్టమైన లిక్విడ్‌ ప్రొపెల్షన్‌ సిస్టమ్‌ను క్రూ మాడ్యూల్‌తో విజయవంతంగా అను సంధానించింది. అనుసంధానం తర్వాత ఈ మాడ్యూల్‌ను జ‌న‌వ‌రి 21వ తేదీ శ్రీహరి కోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌కు తరలించినట్లు బెంగళూరులో ఇస్రో వారి లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ జ‌న‌వ‌రి 22వ తేదీ ప్రకటించింది. 
 
మానవసహిత అంతరిక్ష ప్రయోగాల్లో తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు ఇస్రో తొలిసారిగా గగన్‌యాన్‌ పేరిట ఒక మానవరహిత ప్రయోగాన్ని చేపడుతుంది. ఈ మానవరహిత ప్రయోగం కోసమే తొలిసారిగా ఈ క్రూ మాడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారు. 

తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ)లో రూపొందించిన క్రూ మాడ్యూల్‌ అప్‌రైటింగ్‌ సిస్టంను మహేంద్రగిరిలోని లిక్విడ్‌ ప్రపొల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ (ఎల్‌పీఎస్‌సీ)లో ప్రొపల్షన్‌ సిస్టంతో అను సంధానించారు. 

Dark Oxygen: స‌ముద్ర గ‌ర్భంలో ఆక్సిజన్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఇదే తొలిసారి!!

క్రూ మాడ్యూల్‌ ప్రొపల్షన్‌ సిస్టం అనేది ఒక రియాక్షన్‌ కంట్రోల్‌ సిస్టం(ఆర్‌సీఎస్‌). అంటే క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి స్వేచ్ఛగా వదిలేశాక భూమి దిశగా దిగొచ్చేటప్పుడు దాని వేగాన్ని నియంత్రించి పారాచూట్‌ల సాయంతో నెమ్మదిగా సముద్రం మీదకు దిగేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో ఇమడ్చారు. 

కిందకు పడేటప్పుడు సూటిగా వచ్చేలా, అటు ఇటూ తిరక్కుండా, పల్టీలు కొట్టకుండా మూడురకాలుగా దాని భద్రతను చూడటమే ఆర్‌సీఎస్‌ పని. వ్యోమనౌక నుంచి విడిపోయి అంతరిక్షంలోకి చేరుకునే టప్పుడు, తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు పారాచూట్‌లు విచ్చుకోకముందు ఆర్‌సీఎస్‌ను వాడతారు. 

SpaceX: చంద్రుడిపైకి ఒకేసారి.. రెండు ల్యాండర్ల ప్రయోగం

Published date : 23 Jan 2025 01:01PM

Photo Stories