Gaganyaan Mission: అక్టోబర్ 21న గగన్‌యాన్
Sakshi Education
అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించే ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక పరీక్షలకు సిద్ధమైంది. ఈ మిషన్‌లో భాగంగా మొట్టమొదటి టెస్ట్ వెహికల్ డెవలప్‌మెంట్ ఫ్లైట్(టీవీ-డీ1)ను ఈ నెల 21న తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట నుంచి చేపట్టనున్నారు.
గగన్‌యాన్ మిషన్‌లో కీలకమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ యొక్క సామర్థ్యాన్ని కూడా ఇస్రో పరీక్షించనుంది. గగన్‌యాన్ మిషన్‌లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ అత్యంత కీలకమైనది. అంతరిక్షం నుంచి వ్యోమగాములను తిరిగి భూమిపైకి సురక్షితంగా దిగడానికి క్రూ ఎస్కేప్ వ్యవస్థ సాయపడుతుంది.
ISRO plans to build space station: అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా ఇస్రో
ఈ పరీక్షలో క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపడం, దానిని తిరిగి భూమికి తీసుకురావడం, బంగాళాఖాతంలో పడేలా చేయడం తర్వాత మాడ్యూల్‌ను స్వాధీనం చేసుకుని పునర్వినియోగానికి సిద్ధం చేయడం వంటివి చేపట్టనున్నారు. మాడ్యూల్‌ను వెలికితీసేందుకు ఇండియన్ నేవీ సిబ్బంది ఇప్పటికే మాక్ ఆపరేషన్లు ప్రారంభించింది. ప్రయోగం విజయవంతమయితే మొదటి మానవరహిత గగన్‌యాన్ మిషన్‌గా ఇది నిలవనుంది.
Published date : 12 Oct 2023 03:15PM