Isro Space Tourism: ఇస్రో స్పేస్ టూరిజం
మరోవైపు 2030 నాటికి స్పేస్ టూరిజానికి కూడా ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది. గగన్‌యాన్ ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాలను, అనంతరం మానవ సహిత ప్రయోగాలను నిర్వహించనుంది.
Chandrayaan-3: స్లీప్ మోడ్‌లోకి ప్రజ్ఞాన్ రోవర్
మానవ సహిత ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన వెంటనే స్పేస్ టూరిజం వైపు అడుగులు వేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ఇస్రో వెబ్‌సైట్‌లో గురువారం వివరాలు పేర్కొన్నారు. గగన్‌యాన్ ప్రయోగాల్లో మానవ సహిత ప్రయోగాల్లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించి తిరిగి క్షేమంగా తీసుకువచ్చిన తర్వాత ఇస్రో స్పేస్ టూరిజం ప్రాజెక్ట్ చేపడుతుందని సోమనాథ్ తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్లే పర్యాటకులకు ఒక్కో టికెట్ ధర రూ.ఆరు కోట్లు ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ISRO planning to send astronauts into space: త్వరలో రోదసీలోకి మనిషిని పంపనున్న ఇస్రో?