ISRO plans to build space station: అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా ఇస్రో
నెట్‌వర్క్(సీజీటీఎన్)కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా అంతరిక్ష కేంద్ర నిర్మాణం, దీర్ఘకాల మానవ అంతరిక్షయానంతోపాటు భవిష్యత్తు మిషన్ల కోసం వివిధ అవకాశాలను అన్వేషిస్తోందని తెలిపారు.
Venus mission: శుక్ర గ్రహ అన్వేషణకు ఇస్రో ఏర్పాట్లు
అంతరిక్ష కేంద్రం ఏర్పాటు భారతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుందనే విషయం పరిశీలిస్తున్నామన్నారు. సమీప భవిష్యత్తులో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రోబోటిక్ ఆపరేషన్‌తో ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించుకున్నట్లు వివరించారు. ప్రస్తుతానికి మానవ సహిత అంతరిక్ష యానంపై దృష్టిసారించామన్నారు. గగన్‌యాన్ కార్యక్రమం అదే దిశగా సాగుతోందని చెప్పారు. అది నెరవేరితే, ఆ తర్వాత వచ్చే 20–25 ఏళ్లలో చేపట్టే మిషన్లలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు ఉంటుందన్నారు. తద్వారా ఇప్పటికే ఈ దిశగా విజయం సాధించిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరుతుందన్నారు.