Venus mission: శుక్ర గ్రహ అన్వేషణకు ఇస్రో ఏర్పాట్లు
Sakshi Education
చంద్రయాన్ ప్రయోగం విజయవంతం అయింది. ఆదిత్యయానం కొనసాగుతోంది.
ఇక సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్ర గ్రహం అన్వేషణ కోసం అంతరిక్ష సంస్థ తన తదుపరి మిషన్ శుక్ర యాత్రకు ఏర్పాట్లన్నీ శరవేగంగా పూర్తవుతున్నట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. దానికి సంబంధించిన పేలోడ్లు ఇప్పటికే సిద్ధమైనట్టు ఆయన బుధవారం వివరించారు.
Aditya L1 begins its Journey to the Sun: సూర్యుడి దిశగా ప్రయాణం మొదలు పెట్టిన ఆదిత్య ఎల్-1
శుక్ర గ్రహం చాలా ఆసక్తికరమైన గ్రహం. దానికి వాతావరణం కూడా ఉంది. దాని వాతావరణం చాలా దట్టంగా ఉంది. వాతావరణ పీడనం భూమి కంటే 100 రెట్లు ఎక్కువ, శుక్ర గ్రహం ఆమ్లాలతో నిండి ఉంది. అక్కడి ఉపరితలం గట్టిగా ఉందో లేదో తెలియదు అని ఎస్.సోమనాథ్ తెలిపారు. శుక్రుని అధ్యయనం భూగోళం భవితవ్యానికి సంబంధించి కీలక సమాచారం అందజేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇప్పటికే శుక్రయానాలకు తెర తీశాయి.
Diamond Planet: ఆకాశంలో డైమండ్ గ్రహం
Published date : 29 Sep 2023 11:42AM