Skip to main content

GSLV-F15: జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌15 అనుసంధానం పూర్తి

జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌ 15తో ఎన్‌వీఎస్‌–02 ఉపగ్రహాన్ని అనుసంధానించడం జ‌న‌వ‌రి 26వ తేదీ పూర్తయింది.
Isro to launch NVS-02 on GSLV-F15 to boost Indian constellation

దేశీయంగా రూపుదిద్దుకున్న క్రయోజనిక్‌ జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌15 రాకెట్‌ ఎన్‌వీఎస్‌–02ను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని షార్‌ డైరెక్టర్‌ రాజరాజన్ అన్నారు. వివరించారు. శ్రీహరి కోటలోని షార్‌ నుంచి ఇది 100వ మిషన్‌ కానుందన్నారు. 
 
రెండో లాంచ్‌ప్యాడ్‌ నుంచి చేపట్టే ప్రయోగంలో ఎన్‌వీఎస్‌–02ను జియో సిక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆదివారం ఆయన మీడియాకు వివరించారు. జీఎస్‌ల్‌వీఎల్‌ ఎప్‌15 రాకెట్‌ ప్రయోగానికి 27 గంటల ముందు అంటే 28వ తేదీ తెల్లవారు జామున 3.23 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలయ్యే అవకాశం ఉందన్నారు. 29న ఉదయం 6.23 గంటలకు ప్రయోగం ఉంటుందని చెప్పారు. 

Union Cabinet: శ్రీహరికోటలో మూడో లాంచ్‌ ప్యాడ్.. దీని నిర్మాణానికి రూ.3,985 కోట్లు

మూడో లాంచ్‌ప్యాడ్‌కు నెలలో శంకుస్థాపన 
సతీష్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ (షార్‌)లో మరో ప్రయోగ వేదిక నిర్మాణానికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రూ.3,984 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని రాజరాజన్‌ గుర్తు చేశారు. ఇందుకు అవసరమైన స్థలం ఎంపిక పూర్తయిందని, నెల రోజుల్లోనే భూమిపూజ ఉంటుందని వివరించారు. దీనికి అనుసంధానంగానే న్యూ జనరేషన్‌ లాంచింగ్‌ వెహికల్‌ను రూపొందించనున్నామన్నారు. 

భవిష్యత్తులో దీనిద్వారానే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించి తిరిగి తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టనున్నామని తెలిపారు. కొత్త తరం లాంచింగ్‌ వెహికల్‌తో 20 నుంచి 25 టన్నుల ఉపగ్రహాలను సైతం కక్ష్యలోకి పంపించొచ్చని చెప్పారు. తమిళనాడులోని కులశేఖర్‌పట్నంలో నిర్మిస్తున్న రాకెట్‌ ఫ్రయోగ వేదిక డిసెంబర్‌ 31 నాటికి పూర్తవుతుందన్నారు.

Pangolin Species: కొత్త పంగోలిన్ జాతులను గుర్తించిన శాస్త్రవేత్తలు

Published date : 27 Jan 2025 01:50PM

Photo Stories