C-295 Aircraft inducted into Air Force: ఐఏఎఫ్‌లోకి సీ–295 రవాణా విమానం
Sakshi Education
భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లోకి మొదటి సీ–295 రకం రవాణా విమానం చేరింది.
ఈ విమానాలు ఐఏఎఫ్ వ్యూహాత్మక రవాణా సామర్థ్యం పెంపులో కీలకంగా మారనున్నాయి. ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సీ–295 విమానాన్ని ఐఏఎఫ్‌లోకి తీసుకున్నారు.
Isro Space Tourism: ఇస్రో స్పేస్ టూరిజం
వడోదర ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి పనిచేసే స్క్వాడ్రన్ నంబర్ 11కు సీ–295ను అందజేయనున్నారు. కేంద్రం 56 సీ–295 రవాణా విమానాల్ని కొనుగోలు చేసేందుకు ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో రూ.21,935 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మొదటి సీ–295 విమానాన్ని ఈ నెల 13న ఐఏఎఫ్ చీఫ్ అందుకున్నారు. ఈ విమానాలను ప్రస్తుతమున్న పాతకాలం ఆవ్రో– 748ల బదులు వినియోగించుకుంటారు.
Published date : 27 Sep 2023 12:56PM