Nadu Nedu Scheme: ‘మా బడి – మంచి గుడి’ నాడు-నేడు అమలుపై అభిప్రాయాలు ఇవే..
అప్పట్లో ప్రభుత్వ బడులు ఏమాత్రం అభివ`ద్ధి నోచుకోలేదు. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ బడులను నాడు నేడు పథకంలో అభివ`ద్ధి చేశారు. గతంలో కనీవినీ ఎరుగరి రీతిలో కోట్లాది రూపాయలను ఖర్చు చేయడంతో సర్కారు బడుల రూపురేఖలు మారాయి. నాడు-నేడు పథకం అమలుపై తల్లిదండ్రులు, ఉపాద్యాయుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. చిత్తూరు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు చెప్పించారు.
నా సర్వీసులో చూడలేదు
నేను సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక పాఠశాలల్లో పనిచేశాను. ప్రభుత్వ బడుల అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేసిన దాఖలాలు ఎప్పుడూ లేవు. బడుల్లో ఏ చిన్న పని చేయాలన్నా గతంలో నివేదికలు పంపించాలి. ఆ నివేదికలన్నీ బుట్టదాఖలయ్యేవి. వేల రూపాయాల్లో మాత్రమే అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చేవారు. ప్రస్తుతం లక్షల్లో, కోట్లల్లో నాడు నేడు పథకం కింద నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో అన్ని రకాల వసతులను సమకూర్చారు. – అశోక్ బాబు, నోడల్ హెచ్‌ఎం, గంగాధరనెల్లూరు
కూలి చేసి చదివిస్తున్నాం
మాకు కూలి పనులు చేయడం తప్ప ఇంకే వృత్తి తెలియదు. నాకు ముగ్గు రు పిల్లలు, వారందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో అన్ని వసతులను కల్పించి, చదువును చెప్పిస్తోంది. మా పిల్లలను ప్రైవేట్ బడులకు పంపిస్తే బాగుంటుందని గతంలో అనుకునేవాళ్లం. జగనన్న చేస్తున్న అభివృద్ధి చూసి, ఇక్కడే చేర్పించాం. ప్రైవేట్ బడుల్లో లేని వసతులు సర్కారు బడుల్లో ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తున్నారు. మాకు ఇంతకన్నా ఇంకేం కావాలి. జగనన్న చేస్తున్న మేలును ఎప్పటికీ మరిచిపోం. – భాగ్యలక్షి, విద్యార్థుల తల్లి