Tabs Distribution: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ.. ట్యాబ్ విలువ ఎంతంటే..?
పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం మేరకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ గల 4,34,185 ట్యాబ్స్‌ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిసెంబర్ 21న (గురువారం) ఈ పంపిణీని ప్రారంభించారు.
దాదాపు రూ.17,500కు పైగా మార్కెట్ విలువ గల ఒక్కో ట్యాబ్.. రూ.15,500 విలువ గల బైజూస్ కంటెంట్‌తో కలిపి ప్రతి విద్యార్థికీ రూ.33వేల మేర లబ్ధి చేకూరనుంది. ఇప్పుడిచ్చే ట్యాబ్స్‌తో కలిపి రెండేళ్లలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి రూ.1,305.74 కోట్ల విలువైన 9,52,925 ట్యాబ్‌లను ప్రభుత్వం అందించింది. వీటిల్లో ఎనిమిదో తరగతితో పాటు, 9, 10 తరగతుల బైజూస్ కంటెంట్‌ను కూడా లోడ్ చేయడంతో పాటు ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా అప్‌లోడ్ చేసేందుకు వీలుగా ట్యాబ్ సామర్థ్యాన్ని 256 జీబీకి పెంచి అందిస్తున్నారు. ఇక గత ఏడాది విద్యార్థులు, ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్స్‌ను పంపిణీ చేశారు.
Jagananna Videshi Vidya Deevena: పేద విద్యార్థులకు విదేశీ విద్యా దీవెన.. దాదాపు కొన్ని వందల కోట్లు జమ..!
ఉచిత ట్యాబ్‌లో ఉన్నత కంటెంట్..
►ప్రతి ట్యాబ్‌లోను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, టోఫెల్ ప్రిపరేషన్‌లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్’ అప్లికేషన్ ఉంది.
►విద్యార్థులు సులభంగా విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా ‘డ్యులింగో’ యాప్‌ను సైతం ఇన్‌స్టాల్ చేసి, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో సైతం పనిచేసేలా ఏర్పాటుచేశారు.
►ప్రస్తుతం 4 నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా అందిస్తున్న రూ.15,500 విలువైన బైజూస్ కంటెంట్‌ను ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం అందించనున్నారు.
►తద్వారా 34.3 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది.
►ఈ ట్యాబ్‌ల మెమరీ సామర్థ్యం పెంచడంతో పాటు ట్యాబ్ సంరక్షణకు రగ్డ్ కేస్, టెంపర్డ్ గ్లాస్ వంటి హంగులు సైతం సమకూర్చారు.
► అవాంఛనీయ సైట్లు, యాప్స్‌ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రక్షణతో పాటు మూడేళ్ల వారంటీతో వీటిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.
AP CM YS Jagan Mohan Reddy : దేశ చరిత్రలో.. రికార్డు స్థాయిలో ఒకే సారి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం ఇదే..
Tags
- CM Jagan
- Distribute Tabs
- School Students
- 8th Class Students
- distribution of tabs for students
- FREE TABS
- duolingo app
- Andhra Pradesh
- Tabs For Students
- YS Jagan Mohan Reddy
- Alluri Sitarama Raju District
- DigitalEmpowerment
- GovernmentSchools
- StateGovernment
- TabletDistribution
- SchoolDigitalLearning
- Sakshi Education Latest News