Skip to main content

Andhra Pradesh: టూరిస్ట్ పోలీస్ స్టేష‌న్ల‌కు సీఎం జ‌గ‌న్ శ్రీకారం

పర్యాటకుల భద్రతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.

పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 ​టూరిస్ట్ పోలీసు స్టేషన్‌లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ పర్యాటకుల భద్రత కోసమే ఈ టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. యాత్రికులు నిర్భయంగా పర్యాటక ప్రదేశాల్లో గడిపేందుకు ఈ పోలీస్‌ స్టేషన్లు ఉపయోగపడతాయన్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రయం చేపట్టామ‌ని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. 

YS Jagan Mohan Reddy

టూరిస్ట్ పోలీస్‌ బూత్
అలాగే విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన టూరిస్ట్ పోలీస్ బూత్‌ను కూడా సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. పోలీస్‌ బూత్‌తోపాటు 10 ద్విచక్ర వాహనాలు, రెండు పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు. నగరానికి వచ్చే పర్యాటకులకు మరింత భద్రత చేకూరేల బీచ్ పోలీసింగ్‌ను తీర్చిదిద్దారు.

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లక్షకు పైగా జాబ్స్‌

Published date : 14 Feb 2023 03:11PM

Photo Stories