Skip to main content

AP Air Connectivity: ఇకపై ఏపీ నుంచే నేరుగా విదేశాలకు..

ఇకపై విదేశాలకు వెళ్లేవారు హైదరాబాద్‌తో సంబంధం లేకుండా ఏపీ నుంచే నేరుగా వెళ్లేలా విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరముందని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.
Promoting direct flights from AP for international travel. ap to abroad direct connectivity, Promoting direct flights from AP for international travel.

అందుకు సంబంధించి మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన అవసరమన్నారు. రాష్ట్ర విమానయాన రంగంపై ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌–విమానయా­నం ద్వారా కనెక్టివిటీ’ అనే అంశంపై లవ్‌ అగర్వాల్‌ అధ్యక్షతన మంగళవారం సమీక్షా సమావేశం జరి­గింది.

AP Agricultural Yields: ఏపీలో ఆహార ధాన్యాల రికార్డు స్థాయి దిగుబడులు

ప్రభుత్వ సలహాదారుడు ఆదిత్యనాథ్‌ దాస్, ప­రిశ్రమలు, వాణిజ్యశాఖ సెక్రటరీ యువరాజ్, ఏపీ భవన్‌ అడిషినల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ హిమాన్షు కౌశిక్, విశాఖ, తిరుపతి, కడప, కర్నూలు ఎయిర్‌ పోర్టుల డైరెక్టర్లు, వివిధ ప్రైవేటు విమానయాన సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈసందర్భంగా లవ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ఏపీలోని వివిధ పట్టణాల మధ్య విమాన సర్వీసులను పెంచడం ద్వారా ప్రజలకు మెరుగైన ప్రయాణం, రవా­ణా సదుపాయాల్ని కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విమానయాన సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.  

New investments in AP: పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రపథంలో ఏపీ

Published date : 29 Nov 2023 03:15PM

Photo Stories