CRPF Recruitment Test: ప్రాంతీయ భాషల్లోనూ సీఆర్‌పీఎఫ్ పరీక్ష?
Sakshi Education
సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్‌లో కంప్యూటర్ టెస్ట్‌ను తమిళంలో నిర్వహించకపోవడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వ్యతిరేకించారు.
హిందీ, ఇంగ్లిష్‌ల్లోనే నిర్వహించడం సరికాదన్నారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. ‘‘పైగా 100 మార్కుల్లో హిందీ ప్రాథమిక పరిజ్ఞానానికి 25 మార్కులను కేటాయించడం వల్ల హిందీ మాట్లాడే అభ్యర్థులకే లబ్ధి కలిగింది. చర్య అభ్యర్థుల రాజ్యాంగ హక్కుకు భంగం కలిగించడమే. వీటిని నివారించేందుకు హిందీయేతర భాషలు మాట్లాడే వారి కోసం తమిళం సహా ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష చేపట్టేలా చర్యలు తీసుకోండి’’ అని కోరారు.
Weekly Current Affairs (National) Bitbank: ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఏ నగరంలో ప్రారంభమైంది?
Published date : 10 Apr 2023 03:02PM