Vibrant Gujarat Global Summit: వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 ప్రారంభం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్లోబల్‌గా వివిధ దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీ సీఈవోలతో భారత్‌లోని వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు.
ఈ సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024లో 50 శాతం మేర ‘గ్రీన్ ఎంఓయూ’లు కుదరనున్నట్లు తెలిపారు. జీ20 వంటి అంతర్జాతీయ సదస్సులకు భారత్ ప్రాతినిధ్యం వహించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమ్మిట్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34 దేశాలు పాల్గొననున్నట్లు చెప్పారు. గుజరాత్‌లో పెట్టుబడి అవకాశాలను పెంచడానికి సేల్స్‌ఫోర్స్, అబాట్, బ్లాక్‌స్టోన్, హెచ్‌ఎస్‌బీసీ, యూపీఎస్, మైక్రోన్, సిస్కో, ఎస్‌హెచ్‌ఆర్‌ఎం వంటి దాదాపు 35 ఫార్చ్యూన్ అమెరికన్ కంపెనీలు ఈ సదస్సుకు హాజరవుతున్నాయని తెలిపారు.
Republic Day 2024: గణతంత్ర వేడుకల్లో మహిళా త్రివిధ దళాల బృందం
దేశవ్యాప్తంగా రూ.12 లక్షల కోట్లు పెట్టుబడి..
ఈ సదస్సులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌అంబానీ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రధాని నరేంద్ర మోదీ మాటకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ సదస్సును 20 ఏళ్ల నుంచి విజయవంతంగా నిర్వహించడం గొప్పవిషయం అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్‌లో భారీ పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా రూ.12 లక్షలకోట్లు పెట్టుబడి పెట్టినట్లు వివరించారు. అందులో మూడోవంతు గుజరాత్‌లోనే ఉన్నట్లు తెలిపారు. దాంతో ప్రభుత్వ సహకారంతో చాలామందికి ఉపాధికల్పిస్తున్నట్లు చెప్పారు. 2036 ఒలింపిక్స్ కోసం భారత్ బిడ్ వేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
‘వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’ 2003లో ప్రారంభించారు. ప్రస్తుతం జరుగుతున్న పదో ఎడిషన్ సదస్సుతో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సదస్సులో భాగంగా వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో 2024లో డిజిటల్ ఇండియా కార్యక్రమాలు, ఇండియా స్టాక్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఇండస్ట్రీ 4.0, స్మార్ట్ మ్యాన్యుఫ్యాక్ట్, స్మార్ట్ మ్యాన్యుఫ్యాక్ట్), ఛాంపియన్ సర్వీసెస్ సెక్టార్, డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్‌ను ప్రదర్శించనున్నారు.