Ayushman Bharat: ‘ఆయుష్మాన్ భారత్–ప్రదానమంవత్రి జన ఆరోగ్య యోజన’కు శ్రీకారం
తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జన్మదినోత్సవం సందర్భంగా వైద్య రంగానికి సంబంధించి రూ.12,850 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. 70 ఏళ్లు దాటిన వారిని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి తీసుకొస్తానని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ఈరోజు నెరవేరుస్తున్నానని తెలిపారు. ఏబీ–పీఏంజేఏవైతో 4 కోట్ల మంది లబ్ధి పొందుతారని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో అమలు చేయడం లేదని మోదీ విరుచుకుపడ్డారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ వయ వందన కార్డులు అందజేస్తాం. వీటితో ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం పొందవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,000కుపైగా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటిలో 80 శాతం డిస్కౌంట్‌తో ఔషధాలు లభిస్తున్నాయి. ఈ కేంద్రాలతో పేదలు, మధ్యతరగతికి రూ.30,000 కోట్ల మేర లబ్ధి కలిగింది.
స్టెంట్లు, మోకాలి ఇంప్లాంట్ల వంటి పరికరాల ధరలు తగ్గించడంతో సామాన్య ప్రజలకు రూ.80,000 కోట్లు ఆదా అయ్యాయి. దేశంలో గత పదేళ్లలో దాదాపు లక్ష ఎంబీబీఎస్, ఎండీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే ఐదేళ్లలో మరో 75,000 సీట్లు రాబోతున్నాయి. వైద్య విద్య నిరుపేదలకు సైతం సులభంగా అందుబాటులోకి రావాలన్నదే మా లక్ష్యం’ అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
Mann Ki Baat: దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు.. ‘డిజిటల్ అరెస్టు’కు భయపడొద్దు అని చెప్పిన మోదీ..