Penicillin-G Plant: కాకినాడలో పెన్సిలిన్–జీ ప్లాంటు ప్రారంభం
Sakshi Education
పెన్సిలిన్–జి ఉత్పత్తి కోసం కాకినాడలో నెలకొల్పిన ప్లాంటును ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 29వ తేదీ వర్చువల్‌గా ప్రారంభించినట్లు ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మాలో భాగమైన లిఫియస్ ఫార్మా వెల్లడించింది.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపింది.
ప్లాంట్ వివరాలు..
➣ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద రూ.2,500 కోట్ల వ్యూహాత్మక పెట్టుబడితో ఈ ప్లాంట్ ఏర్పాటైంది.
➣ ఈ ప్లాంట్ వార్షికంగా 15,000 మెట్రిక్ టన్నుల (ఎంటీ) పెన్స్‌లిన్ ఉత్పత్తి చేయగలదు.
ప్రభుత్వ లక్ష్యం
భారత్‌ను ఫార్మా తయారీ హబ్‌గా తీర్చిదిద్దడం కోసం, కంపెనీ స్వయంసమృద్ధి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అందించేందుకు తన వంతు తోడ్పాటును అందించేందుకు కట్టుబడిందని లిఫియస్ ఫార్మా డైరెక్టర్ ఎంవీ రామకృష్ణ తెలిపారు.
Ayushman Bharat: ‘ఆయుష్మాన్ భారత్–ప్రదానమంవత్రి జన ఆరోగ్య యోజన’కు శ్రీకారం
Published date : 01 Nov 2024 09:51AM