PM Modi: భారత్‌లో భారీగా పెరుగుతున్న రక్షణ ఉత్పత్తులు, ఎగుమతులు
రక్షణ ఉత్పత్తుల్లో మన దేశ ప్రయాణం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని చెప్పారు. రక్షణ రంగంలో పాలుపంచుకోవాలని కావాలని స్టార్టప్‌లు, తయారీదారులు, వ్యాపారవేత్తలకు, యువతకు పిలుపునిచ్చారు. ఈ రంగంలో నవీన ఆవిష్కరణలు సృష్టించేందుకు ముందుకు రావాలని సూచించారు. చరిత్రలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు మోదీ అక్టోబర్ 30వ తేదీ ‘లింక్డ్‌ఇన్’లో పోస్టు చేశారు.
దేశానికి అవసరమైన అనుభవం, సామర్థ్యాలు, ఉత్సాహం అందించాలంటూ మోదీ పిలుపునిచ్చారు. 2023-24లో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.27 లక్షల కోట్లకు చేరుకుంటుందని, 2014లో కేవలం రూ.1,000 కోట్ల ఎగుమతులు ఇప్పుడు రూ.21,000 కోట్లకు పెరిగాయన్నారు.
ఇటీవల.. 12,300 రకాల రక్షణ పరికరాలను దేశీయంగా తయారు చేస్తున్నామని, రక్షణ రంగంలోని ప్రభుత్వ సంస్థలు రూ.7,500 కోట్ల పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడులో అభివృద్ధి చెందిన డిఫెన్స్ కారిడార్ల గురించి కూడా ఆయన వెల్లడించారు.
Ayushman Bharat: ‘ఆయుష్మాన్ భారత్–ప్రదానమంవత్రి జన ఆరోగ్య యోజన’కు శ్రీకారం
ఈ పరిణామాల ద్వారా, భారత్ రక్షణ ఉత్పత్తులలో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. దీంతో బలమైన, స్వయం సమృద్ధితో కూడిన భారత్ నిర్మించేందుకు దోహదం చేయాలని కోరారు.