Skip to main content

Baltimore Bridge: బాల్టిమోర్ బ్రిడ్జ్ విధ్వంసానికి రూ.850 కోట్ల నష్టపరిహారం

US gets $101.1m settlement for Baltimore bridge collapse

అమెరికాలోని బాల్టిమోర్‌లో ఈ ఏడాది మార్చిలో జరిగిన నౌక ఢీకొనడంతో కూలిన భారీవంతెన ఘటనలో కార్గో షిప్ యజమాని రూ.850 కోట్ల నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చారు.

ఈ ఘోరంలో భారీ నష్టం జరిగింది, ఆరుగురి ప్రాణాలు పోయాయి. దాదాపు ఏడువారాల తర్వాత ఈ పరిష్కారం లభించింది. గ్రేస్ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్, సినర్జీ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి 101.1 మిలియన్ డాలర్ల (రూ.850 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించినట్లు అమెరికా న్యాయశాఖ అధికారికంగా ప్రకటించింది.

అయితే.. ఈ ఒప్పందంలో వంతెన పునర్నిర్మాణాన్ని చేర్చలేదని న్యాయశాఖ వెల్లడించింది. అది మేరీల్యాండ్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక దావా అంశంగా పేర్కొంది.

India China Border: సరిహద్దు గస్తీపై భారత్‌–చైనా మధ్య ఒప్పందం

Published date : 26 Oct 2024 04:58PM

Photo Stories