Bar Councils: బలహీనవర్గాల న్యాయవాదుల నమోదుకు అధిక రుసుములు వద్దు
Sakshi Education
బలహీన వర్గాలకు చెందిన న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి రాష్ట్ర బార్ కౌన్సిళ్లు(ఎస్‌బీసీ) అధిక రుసుము వసూలు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ తీర్పు వెలువరిచింది.
సుప్రీంకోర్టు తీర్పు ముఖ్యాంశాలు ఇవే..
సమానత్వ సూత్రం: బలహీన వర్గాలకు చెందిన న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి అధిక సభ్యత్వ రుసుము వసూలు చేయడం సమానత్వ సూత్రానికి విరుద్ధం.
రుసుముల పరిమితి: జనరల్ కోటాలోని పట్టభద్రుల నుంచి రూ.750, షెడ్యూల్డ్ కులాలు, తెగలవారి నుంచి రూ.125కి మించి సభ్యత్వ నమోదు రుసుమును వసూలు చేయరాదు.
బడుగు వర్గాల ప్రయోజనం: బలహీన వర్గాలవారికి న్యాయవాద వృత్తిలో ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటే బడుగు వర్గాల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది.
Published date : 01 Aug 2024 09:35AM