BRICS Summit: బ్రిక్స్ దేశాల వార్షిక సదస్సుకు అధ్యక్షత వహించనున్న నేత?
సెప్టెంబర్ 9న వర్చువల్ విధానంలో జరగనున్న ఈ సదస్సులో భారత్ నుంచి ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో పాల్గొననున్నారు. ‘అంతర్గత సహకారం’ అనే అంశం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది.
ఉత్సవంలా మోదీ పుట్టిన రోజు...
2021, సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకొని బీజేపీ భారీ కార్యక్రమాలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ‘సేవ సమర్పణ అభియాన్’ పేరుతో 20 రోజుల వేడుకలకు కార్యాచరణ రూపొందించింది. ప్రధాని మోదీ ప్రజా సేవలో అడుగు పెట్టి 20 ఏళ్లు అయిన సందర్భంగా 20 రోజుల పాటు వేడుకలు సాగించనున్నట్లు తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, సెప్టెంబర్ 9న బ్రిక్స్ దేశాల వార్షిక సదస్సు–2021కు అధ్యక్షత వహించనున్న నేత?
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : అంతర్జాతీయ అంశాలు, అంతర్గత సహకారం వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు...