Cabinet Committee on Security: రూ.10,000 కోట్ల ఒప్పందానికి కేబినెట్ కమిటీ ఆమోదం
![CCS Approves Local Ammunition Procurement Worth Rs 10000 Crore](/sites/default/files/images/2025/01/30/ccs-1738221886.jpg)
ఈ ఒప్పందంలో భాగంగా పినాకా రాకెట్లు, ఏరియా డిస్ట్రక్షన్ మందుగుండు సామగ్రి కొనుగోలు చేయనున్నారు. వీటిని మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్), ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ (ఈఈఎల్) ఉత్పత్తి చేస్తాయి.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన పినాకా రాకెట్లు భారత సైన్యానికి లాంగ్ రేంజ్ ఆర్టిలరీ వ్యవస్థను అందిస్తాయి. ఇవి 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఇవి సైన్యం వ్యూహాత్మక కార్యకలాపాలకు కీలకమైన వనరుగా మారాయి.
ఈ ఒప్పందంలోని మరో కీలక అంశం ఏరియా డేనియల్ మ్యునిషన్స్(ఏడీఎం). ఈ ఒప్పందాన్ని డీఆర్‌డీఓ, ఎంఐఎల్, ఈఈఎల్‌కు వాటి వాటా ఆధారంగా విభజిస్తారు. మందుగుండు సామగ్రికి సంబంధించి ఈఈఎల్ కాంట్రాక్ట్ విలువలో 60% అందుకుంటుంది. మిగిలిన 40% ఎంఐఎల్‌కు అందుతుంది. ఈ సహకారం రక్షణ తయారీ రంగంలో స్వావలంబనను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Railway Station: ఏపీలో.. ఈ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.271.43 కోట్లు
ఈ ఒప్పందానికి సీసీఎస్ ఆమోదం లభించడంతో రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తుంది. సైన్యం ఇప్పటికే 10 పినాకా రెజిమెంట్లను కలిగి ఉంది. భవిష్యత్తులో మరిన్ని రాకెట్లు తోడవుతుండడం సైన్యం వ్యూహాత్మక పరిధిని మరింత పెంచుతుంది.
ఈ నిర్ణయం రక్షణ తయారీ రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల టర్నోవర్ సాధించాలనే దేశ లక్ష్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
Union Budget 2025: యూనియన్ బడ్జెట్ 2025 నుంచి కీలక అంచనాలు ఇవే..