Railway Station: రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.271.43 కోట్లు

ఈ ప్రాంత అభివృద్ధికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపి, నిధులు మంజూరు చేసినట్లు జనవరి 23వ తేదీ దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో, రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్నారు.
ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమం స్టేషన్‌లో అనుసంధానం, మౌలిక సదుపాయాల మెరుగుదలలకు దృష్టి సారించిందని తెలుస్తుంది. 2071-72 సంవత్సరానికి నాటికి, ఈ స్టేషన్ నుంచి రోజుకు 9,533 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా వేశారు. ఇది కూడా ఈ ప్రాజెక్టుకు మరింత ప్రాధాన్యతను ఇస్తోంది.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎన్నికల ముందు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రూ.250 కోట్ల పునరాభివృద్ధి పనులు ఇప్పటికీ టెండర్ల దశలో ఉన్నా, కొత్త ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో వాటి ప్రాసెస్ నిలిచిపోయింది.
PM Modi in AP: ఏపీలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు.. శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ..