Daily Current Affairs in Telugu: 2022, జూన్ 29th కరెంట్ అఫైర్స్
HC Chief Justice: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 28న రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరై నూతన సీజేకు శుభాకాంక్షలు తెలిపారు.
Also read: GK International Quiz: ప్రపంచంలోనే అతిపెద్ద గ్లాస్ బాటమ్ బ్రిడ్జిని ఏ దేశంలో ప్రారంభించారు?
ఇప్పటివరకు సీజేగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అవగా... తదుపరి సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మే 17న సిఫారసు చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల ఆమోదించారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని ప్రకటిస్తూ గత వారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది.
Also read: రాష్ట్రంలోని గ్రామాలలో 58 వేలకు పైగా ప్రదేశాలలో ఉచిత Wi-Fi సౌకర్యాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది?
అసోంకు చెందిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2011 అక్టోబర్ 17న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు. 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 8 నెలల తర్వాత తెలంగాణ హైకోర్టు ఐదో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
T-Hub రెండో దశను ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసీఆర్
‘ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి’ అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ–హబ్ రెండో దశను సీఎం కేసీఆర్ జూన్ 28న ప్రారంభించారు. రూ.400 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌లోని మాదాపూర్–రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్‌గా ఈ టీ–హబ్ 2.0ను నిర్మించారు. ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి 2015లో టీ–హబ్‌ను ఏర్పాటు చేసింది. దీనిని విస్తరిస్తూ అత్యంత పెద్దదైన టీ–హబ్ రెండో దశను ప్రారంభించింది.
Also read: GK Sports Quiz: 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో జరగనున్నాయి?
దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు ఇచ్చేలా..
ఈ సందర్భంగా ముఖ్యంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.... టీ–హబ్ తొలిదశ ద్వారా 2 వేలకుపైగా స్టార్టప్‌లకు ఊతమివ్వడంతోపాటు 1.19 బిలియన్ డాలర్ల నిధులు సమకూరాయని తెలిపారు. వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజిల్ ఇన్వెస్టర్లతో స్టార్టప్‌లను అనుసంధానం చేయడంలో టీ–హబ్ ఎనలేని పాత్ర పోషించిందని... ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టీ–హబ్ రెండో దశ తొలిదశ కంటే ఐదు రెట్లు పెద్దదని వివరించారు. టీ–హబ్‌తో ప్రపంచంలో పది అగ్రశ్రేణి స్టార్టప్ వాతావరణం కలిగిన ప్రాంతాల జాబితాలో తెలంగాణ కూడా ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు.
G-7 Summit 2022: ముగిసిన జీ - 7 శిఖరాగ్ర సదస్సు
ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని జి–7 దేశాధినేతలు ప్రతినబూనారు. రష్యా దాడులు కొనసాగినంత కాలం ఉక్రెయిన్‌కు మద్దతివ్వాలని ఐక్యంగా తీర్మానించారు. జర్మనీలో జరుగుతున్న జి–7 నేతల సదస్సు జూన్ 28తో ముగిసింది. ఈ సందర్భంగా నేతలు తుది ప్రకటన వెలువరించారు.
Also read: Electric Vehicle: ప్రపంచ ఈవీ జాబితాలో భారత్‌కు 11వ ర్యాంక్
‘‘రష్యాపై తక్షణం, అత్యంత కఠినమైన ఆంక్షలు విధించాలని తీర్మానించాం. పెట్రోల్, గ్యాస్ తదితర శిలాజ ఇంధనాల విక్రయాలతో అందుతున్న నిధులతోనే రష్యా యుద్ధానికి దిగింది. అందుకే, రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఈ శిలాజ ఇంధనాలతోపాటు, వాటి ధరలపై పరిమితులు విధించేందుకు వీలు కలి్పంచే చర్యలపై వచ్చే రానున్న వారాల్లో చర్చించి, కార్యాచరణకు దిగుతాం. రష్యాపై ఆంక్షల కొనసాగింపు విషయంలో కలిసి కట్టుగా సమన్వయంతో ముందుకు సాగేందుకు కట్టుబడి ఉంటాం’అని అందులో పేర్కొన్నారు. రష్యా నుంచి ఇంధన దిగుమతులను కనీస స్థాయికి తేవడం ద్వారా ఇంధన ధరలను అదుపు చేయవచ్చని జి–7 నేతలు భావిస్తున్నారు. ఇంధన సరఫరా నౌకలు, బీమా కంపెనీలు అత్యధికం యూరప్ దేశాలవే కావడం కూడా కలిసివచ్చే అంశమని ఆశిస్తున్నారు. దీంతోపాటు, రష్యా నుంచి బంగారం దిగుమతులను నిషేధించడంతోపాటు, నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్ నుంచి గోధుమల రవాణాను రష్యా నిలువరించడంతో ఆహారం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు సాయం చేయాలని నేతలు నిర్ణయించారు. ఈ అసాధారణ పరిస్థితుల్లో సహజవాయు అన్వేషణకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని కూడా తీర్మానించారు.
Also read: IIT Jodhpur: స్వదేశీ పరిజ్ఞానంతో మెటల్ 3డీ ప్రింట
అనంతరం.... మాడ్రిడ్‌లో 28–30 తేదీల్లో జరిగే నాటో సమావేశానికి నేతలు తరలివెళ్లారు.
UAE అధ్యక్షుడు బిన్ జాయెద్ తో ప్రధాని మోదీ భేటీ
యూఏఈ నూతన అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 28న భేటీ అయ్యారు. అబుదాబి విమానాశ్రయంలో షేక్ మొహమ్మద్‌తోపాటు రాజకుటుంబానికి చెందిన సీనియర్ సభ్యులు మోదీకి ఘన స్వాగతం పలికారు. షేక్ మొహమ్మద్ తండ్రి, మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతికి సంతాపం తెలిపారు.
Also read: G7 Summit Germany: జీ7 సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
పీవీకి మోదీ నివాళులు
జూన్ 28న మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. పీవీ దేశానికి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ‘ దేశ ప్రగతికి ఆయన చేసిన కృషికి దేశం కృతజ్ఞతలు తెలుపుతోందంటూ ట్వీట్ చేశారు.
England Captain Morgan: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్
అంతర్జాతీయ వన్డేలు, టి20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్ 36 ఏళ్ల మోర్గాన్ ప్రకటించాడు. గత రెండేళ్లుగా బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోవడంతో పాటు గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఒకదశలో తన దూకుడైన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు వెన్నెముకలా నిలిచిన మోర్గాన్ ఒక్కసారిగా ఫామ్ కోల్పోయాడు. 2021 జనవరి నుంచి 48 ఇన్నింగ్స్‌లో అతను ఒకే ఒక అర్ధ సెంచరీ సాధించాడు.
Also read: UAE అధ్యక్షుడు బిన్ జాయెద్ తో ప్రధాని మోదీ భేటీ
కెప్టెన్‌గా ప్రత్యేక అధ్యాయం...
డబ్లిన్‌లో పుట్టిన మోర్గాన్ 16 ఏళ్ల వయసులో సొంత దేశం ఐర్లాండ్ తరఫున అరంగేట్రం చేసి 2007 వన్డే వరల్డ్‌కప్ ఆడాడు. మొత్తం 23 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఇంగ్లండ్ జట్టుకు మారాడు. మొదటి నుంచి దూకుడైన బ్యాటింగ్ శైలి కలిగిన మోర్గాన్ 2010 టి20 వరల్డ్‌కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో కూడా సభ్యుడు. వన్డేల్లో అతని హయాంలోనే ఇంగ్లండ్ ఐదుసార్లు 400కు పైగా పరుగులు సాధించగా, టాప్–3 ఆ జట్టు ఖాతాలోనే ఉన్నాయి. 2016 టి20 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్ వరకు చేర్చిన మోర్గాన్ .... 2019లో ఇంగ్లండ్ కు వన్డే వరల్డ్ కప్ అందించి... వన్డే క్రికెట్‌లో ఆ జట్టు 44 ఏళ్ల కల నెరవేర్చాడు.
Also read: England vs New Zealand: న్యూజిలాండ్ తో టెస్ట్ సీరీస్ ని క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్
ఇయాన్ మోర్గాన్ కెరీర్
248 వన్డేల్లో 39.29 సగటుతో 7,701 పరుగులు (14 సెంచరీలు, 47 అర్ధసెంచరీలు).
115 అంతర్జాతీయ టి20ల్లో 136.17 స్ట్రయిక్‌రేట్‌తో 2458 పరుగులు (14 అర్ధ సెంచరీలు).
India vs Ireland 2nd T20I 2022: 2–0తో ఐర్లాండ్‌పై భారత్ సిరీస్ విజయం
ఐర్లాండ్‌తో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్ ని భారత్ 2 - 0 తేడాతో గెలుచుకుంది. జూన్ 28న చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో భారత్ 4 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి 2–0తో సిరీస్ సొంతం చేసుకుంది. దీపక్ హుడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సీరీస్ గా నిలిచాడు.
Also read: Quiz of The Day (June 29, 2022): సిగరెట్ పొగలో ఉండే రేడియోధార్మిక పదార్థం ఏది?
GST: ప్యాక్, లేబుల్డ్ ఆహార పదార్థాలపై 5 శాతం జీఎస్‌టీ
మాంసం, చేపలు, పెరుగు, పనీర్, తేనె వంటి ఆహార పదార్థాల విషయంలో ముందే ప్యాక్ లేదా లేబుల్ చేసిన ఆహార పదార్థాలపై ఇక వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధిస్తారు. దీనితో ఆయా ఆహార పదార్థాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. చెక్కుల జారీకి బ్యాంకులు వసూలు చేసే రుసుముపై కూడా జీఎస్‌టీ అమలవుతుంది. పన్నులను హేతుబదీ్ధకరించే ఉద్దేశంతో మినహాయింపులను ఉపసంహరించుకోవడానికి సంబంధించి రాష్ట్రాల మంత్రుల బృందం (జీఓఎం) చేసిన సిఫార్సులను చాలావరకూ మండలి ఆమోదించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రారంభించిన సమయానికి (2017 జూలై 1) 14.4 శాతంగా ఉన్న సగటు జీఎస్‌టీ రేటు ప్రస్తుతం 11.6 శాతానికి పడిపోయిన నేపథ్యంలో దీనిని పెంచడానికి జీఎస్‌టీ రేటు హేతుబద్ధీకరణ అవసరమని మండలి ప్రధానంగా భావించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఛండీగఢ్ లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో రెండు రోజుల కీలక జీఎస్‌టీ మండలి 47వ సమావేశం జూన్ 28న ప్రారంభమైంది. మొదటిరోజు సమావేశం మంత్రుల బృందం చేసిన పలు సిఫారసులను ఆమోదించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్యాక్డ్, లేబుల్డ్ ఆహార ఉత్పత్తులు పొందుతున్న పన్ను మినహాయింపులను తొలగించాలని సుదీర్ఘ చర్చ తర్వాత మండలి నిర్ణయించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.
Also read: England Captain Morgan: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్
ఈ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం మండలి నిర్ణయాలు ఇవీ...
- ముందుగా ప్యాక్ చేసిన, లేబుల్ చేసిన మాంసం (ఘనీభవించిన స్థితిలోలేని పదార్ఘాలు మినహా), చేపలు, పెరుగు, పనీర్, తేనె, ఎండిన చిక్కుళ్ళు, ఎండిన మఖానా, గోధుమలు, ఇతర తృణధాన్యాలు, మెస్లిన్ పిండి, బెల్లం, పఫ్డ్ రైస్ (మూరి) సంబంధిత అన్ని ఉత్పత్తులు, సేంద్రియ, కంపోస్ట్ ఎరువుకు ఇకపై జీఎస్‌టీ మినహాయింపు వర్తించదు. దీనిపై ఇకపై 5 శాతం పన్ను విధింపు ఉంటుంది.
- అదేవిధంగా చెక్కుల జారీకి (వదులుగా లేదా పుస్తక రూపంలో) బ్యాంకులు వసూలు చేసే రుసుముపై 18 శాతం జీఎస్‌టీ విధిస్తారు. అట్లాస్‌సహా మ్యాప్‌లు, చార్ట్‌లపై 12 శాతం లెవీ ఉంటుంది.
- ప్యాక్ చేయని, లేబుల్ లేని, బ్రాండెడ్ కాని వస్తువులపై జీఎస్‌టీ మినహాయింపు కొనసాగుతుంది.
- రోజుకు రూ. 1,000 కంటే తక్కువ ఉన్న హోటల్ గదులపై 12% పన్ను ఇకపై అమలవుతుంది. ప్రస్తుతం ఇక్కడ పన్ను మినహాయింపు ఉంది.
- వంట నూనె, బొగ్గు, ఎల్‌ఈటీ ల్యాంప్స్, ప్రింటింగ్– డ్రాయింగ్ ఇంక్, ఫినిష్డ్ లెదర్ సోలా ర్ వాటర్ హీటర్‌తో సహా అనేక వస్తువుల విషయంలో ఇన్వర్టెడ్ డ్యూటీ వ్యవస్థలో సవరణను కూడా జీఎస్‌టీ మండలి సిఫార్సు చేసింది.
Pallonji Mistry పారిశ్రామిక దిగ్గజం ‘పల్లోంజీ’ అస్తమయం
పారిశ్రామిక దిగ్గజం, బిలియనీర్, షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్ చైర్మన్, పద్మ భూషన్ పల్లోంజీ మిస్త్రీ జూన్ 28న ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు 93 సంవత్సరాలు. పారిశ్రామిక దిగ్గజ సంస్థ.. టాటా గ్రూప్‌లో ఎస్‌పీ గ్రూప్ 18.37 శాతం వాటాతో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. భారతదేశంలో జన్మించిన మిస్త్రీకి ఐరిష్ పౌరసత్వం కూడా ఉంది. దక్షిణ ముంబైలోని నివాసంలో రాత్రి ఒంటిగంటకు ఆయన నిద్రలోనే కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. దక్షిణ ముంబైలోని కెంప్స్ కార్నర్‌లోని టవర్ ఆఫ్ సైలెన్స్ వద్ద పార్సీ సంప్రదాయాల ప్రకారం ‘ఉత్తమ్నా’ ఆచారంతో పల్లోంజీ మిస్త్రీ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.
Also read: HC Chief Justice: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం
1929లో జన్మించిన మిస్త్రీ నిర్మాణరంగంతో సహా టెక్స్‌టైల్స్, షిప్పింగ్, గృహోపకరణాల వంటి పలు ఇతర వ్యాపారాలలో విస్తరించిన ఎస్‌పీ గ్రూప్‌నకు మార్గనిర్దేశకులుగా ఉన్నారు. 29 బిలియన్ డాలర్లకుపైగా నెట్‌వర్త్ కలిగిన ఆయన, 2016లో భారత్ మూడవ అత్యున్నత స్థాయి పౌర పురస్కారం పద్మ భూషన్ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా అందుకున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు. వీరిలో ఒకరైన సైరస్ మిస్త్రీ, రతన్ టాటాకు వారసునిగా టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు. 2016లో హఠాత్తుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయనను చైర్మన్ పదవి నుండి బోర్డ్ తొలగించిన సంగతి తెలిసిందే.
Akash Ambani రిలయన్స్ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా - తనయుడికి చైర్మన్‌గా పగ్గాలు
దేశంలోనే అత్యంత విలువైన కార్పొరేట్ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపర కుబేరుడు, రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ తన వారసులకు ఆస్తుల పంపకం ప్రక్రియకు తెరతీశారు. టెలికం అనుబంధ విభాగమైన రిలయన్స్ జియోకు ముకేశ్ అంబానీ రాజీనామా చేశారు. తద్వారా టెలికం విభాగం పగ్గాలను తనయుడు ఆకాశ్ అంబానీకి అప్పగించారు. జూన్ 27న సమావేశమైన కంపెనీ బోర్డు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాశ్ ఎం. అంబానీని చైర్మన్‌గా నియమించే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు రిలయన్స్ జియో స్టాక్ ఎక్సేంజీలకు తాజాగా సమాచారమిచ్చింది. అదే రోజు సాయంత్రం ముకేశ్ అంబానీ రాజీనామా చేసినట్లు బోర్డు వెల్లడించింది. 217 బిలియన్ డాలర్ల విలువైన ప్రైవేట్ రంగ దిగ్గజం ఆర్‌ఐఎల్ గ్రూప్.. చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్, టెలికం, రిటైల్, మీడియా, న్యూఎనర్జీ విభాగాలలో విస్తరించింది.
also read: UAE అధ్యక్షుడు బిన్ జాయెద్ తో ప్రధాని మోదీ భేటీ
వారసులకు బాధ్యతలు...
ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానంలో ఆకాశ్, ఈషా కవలలుకాగా.. చిన్న కుమారుడు అనంత్. రిటైల్ బిజినెస్ పగ్గాలను కుమార్తె ఈషా (30 ఏళ్లు) చేతికి ఇవ్వనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. పిరమల్ గ్రూప్‌నకు చెందిన ఆనంద్ పిరమల్‌ను ఈషా వివాహం చేసుకున్నారు. అజయ్ పిరమల్, స్వాతి పిరమల్ కుమారుడు ఆనంద్ కాగా.. ఇప్పటికే ఆకాశ్, ఈషా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్‌ఆర్‌వీఎల్) బోర్డులో విధులు నిర్వహిస్తున్నారు. సూపర్ మార్కెట్లు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్, గ్రోసరీ, ఫ్యాషన్, జ్యవెలరీ, ఫుట్‌వేర్, క్లాతింగ్ విభాగాలతోపాటు ఆన్‌లైన్ రిటైల్ వెంచర్ జియోమార్ట్‌ను రిలయన్స్ రిటైల్ కలిగి ఉంది. ఇక డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ (జేపీఎల్) బోర్డులోనూ 2014 అక్టోబర్ నుంచీ వీరిద్దరూ కొనసాగుతున్నారు. ఇక 26 ఏళ్ల అనంత్ ఇటీవలే ఆర్‌ఆర్‌వీఎల్ బోర్డులో డైరెక్టరుగా చేరారు. 2020 మే నుంచి జేపీఎల్‌లోనూ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
Also read: Quiz of The Day (June 29, 2022): సిగరెట్ పొగలో ఉండే రేడియోధార్మిక పదార్థం ఏది?
ఆర్‌ఐఎల్ చైర్మన్‌గా ముకేశ్...
ఆర్‌ఐఎల్‌కు ముకేశ్ అంబానీ చైర్మన్, ఎండీగా, ఆయన సతీమణి నీతా అంబానీ బోర్డులో సభ్యురాలిగా కొనసాగనున్నారు. అంతేకాకుండా జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌కు చైర్మన్‌గానూ ముకేశ్ కొనసాగనున్నారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌సహా అన్ని జియో డిజిటల్ సర్వీసుల బ్రాండ్లు జియో ప్లాట్‌ఫామ్స్ కిందకు వస్తాయి. కంపెనీ వివరాల ప్రకారం అంబానీ కుటుంబ వాటా ఆర్‌ఐఎల్‌లో 50.6 శాతానికి చేరింది. 1973లో ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తదుపరి కంపెనీ టెక్స్‌టైల్స్ నుంచి చమురు, టెలికం, రిటైల్ తదితర రంగాలలో విస్తరించింది.
Crypto Tax:క్రిప్టో కొనుగోలుదారులపై టీడీఎస్ బాధ్యత
ఇద్దరు వ్యక్తుల మధ్య (పీర్ టు పీర్/పీటూపీ) నడిచే క్రిప్టో లావాదేవీలలో టీడీఎస్ మినహాయించి, ఆదాయపన్ను శాఖకు జమ చేయాల్సిన బాధ్యత కొనుగోలుదారులపై ఉంటుంది. ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) క్రిప్టో పన్నులపై ఈ మేరకు మరోసారి స్పష్టత ఇచ్చింది. సెక్షన్ 194 ఎస్ కింద.. పీర్‌టుపీర్ లావాదేవీల్లో వర్చువల్ డిజిటల్ అస్సెట్ (వీడీఏ/క్రిప్టోలు,ఎన్‌ఎఫ్‌టీలు) కొనుగోలు చేసే వారు టీడీఎస్‌ను మినహాయించి, మిగిలిన మొత్తాన్నే విక్రయదారుకు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పీర్‌టూపీర్ అంటే ఎక్సేంజ్ ప్రమేయం లేకుండా వ్యక్తులు చేసుకునే లావాదేవీలు. ఎక్సేంజల్లో అయితే ఆయా ప్లాట్‌ఫామ్‌లు క్లయింట్ల తరఫున టీడీఎస్ మినహాయిస్తాయి. ఒకవేళ వీడీఏలను ఇద్దరు వ్యక్తులు మార్పిడి చేసుకుంటే (ఒకరి వద్దనున్న డిజిటల్ అసెట్స్‌ను అవతలి వ్యక్తికి ఇచ్చి, అవతలి వ్యక్తి వద్దనున్న వేరే వీడీఏలను తీసుకోవడం) అప్పుడు ఇద్దరు సైతం కొనుగోలుదారులు, విక్రయదారుల కిందకు వస్తారని సీబీడీటీ తెలిపింది. అప్పుడు ఇద్దరూ టీడీఎస్‌ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో టీడీఎస్ బాధ్యతను కొనుగోలుదారుపై పెట్టినట్టయింది. క్రిప్టోల లావాదేవీలపై ఒక శాతం టీడీఎస్ నిబంధన 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం తెలిసిందే.
RIMPAC-22. రిమ్ ఆఫ్ ద పసిఫిక్ ఎక్సర్‌సైజ్‌కి INS సాత్పురా
ప్రపంచ ప్రసిద్ధి చెందిన రిమ్ ఆఫ్ ద పసిఫిక్ ఎక్సర్‌సైజ్ 2022లో పాల్గొనడానికి ఐఎన్‌ఎస్ సాత్పురా జూన్ 27న హవాయి దీవులకు చేరుకుంది. ఈ నౌక విన్యాసాలు ఆరు వారాల పాటు నిర్వహిస్తారు. వివిధ దేశాల మధ్య స్నేహ సంబంధాలను, నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచడానికి నావికా సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడుతుంది. ఇందులో 27 దేశాలు పాల్గొంటున్నాయి. భారత్ నుంచి పాల్గొంటున్న ఐఎన్‌ఎస్ సత్పురా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడింది. ఇది 6 వేల టన్నుల మిసైల్‌కు మార్గదర్శకత్వం వహిస్తుంది. ఇది భూమిపైనా, గగనతలంలో, నీటిలో కూడా పనిచేస్తుంది. ఇది విశాఖ కేంద్రంగా తన సేవలను అందిస్తోంది. దీనిని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ విన్యాసాలకు పంపుతున్నారు.
Also read: Crypto Tax:క్రిప్టో కొనుగోలుదారులపై టీడీఎస్ బాధ్యత