England vs New Zealand: న్యూజిలాండ్ తో టెస్ట్ సీరీస్ ని క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్
Sakshi Education
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. జూన్ 27న ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో తమ ఖాతాలో వేసుకుంది. మ్యాచ్‌లో 10 వికెట్లు పడ గొట్టిన లీచ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా... ఇంగ్లండ్ తరఫున రూట్ (396 పరుగులు), న్యూజిలాండ్ తరఫున మిచెల్ (538 పరుగులు) ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు అందుకున్నారు.
also read: CBDT(Central Board of Direct Taxes) చైర్మన్‌గా నితిన్ గుప్తా
Published date : 28 Jun 2022 06:18PM