G7 Summit Germany: జీ7 సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
![G7 Summit - Narendra Modi](/sites/default/files/images/2022/06/28/g7-modi-speechm-6-1656419111.jpg)
జర్మనీలో జరగుతున్న జీ 7 శిఖరాఖ్ర సదస్సులో పాల్గొన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... పర్యావరణ పరిరక్షణకు, తత్సంబంధిత వాగ్దానాలకు భారత్ పూర్తిగా కట్టుబడిందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కొన్నేళ్లుగా భారత్ కనబరుస్తున్న పనితీరే అందుకు నిదర్శనమన్నారు. వాతావరణ మార్పులపై పోరులో సంపన్న జీ7 దేశాలు కూడా భారత్‌తో కలిసి వస్తాయని ఆశాభావం వెలిబుచ్చారు. స్వచ్ఛ ఇంధన పరిజ్ఞానానికి సంబంధించి భారత్‌లో అందుబాటులో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని వాటికి పిలుపునిచ్చారు. జూన్ 27న జీ7 శిఖరాగ్ర సదస్సులో వాతావరణ మార్పులు, ఇంధనం తదితరాలపై జరిగిన భేటీలో మాట్లాడారు. ఇంధన సామర్థ్యంలో 40 శాతాన్ని శిలాజేతర వనరుల నుంచి సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని గడువుకు 9 ఏళ్ల ముందే సాధించామన్నారు.
Also read: Chagari Praveen Kumar: న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌గా జస్టిస్ ప్రవీణ్‌కుమార్
‘‘ప్రపంచ జనాభాలో 17 శాతానికి భారత్ నిలయం. కానీ ప్రపంచ కర్బన ఉద్గారాల్లో దేశ వాటా కేవలం 5 శాతం. ప్రకృతితో కలిసి సాగే మా జీవన విధానమే ఇందుకు ప్రధాన కారణం’’ అని మోదీ అన్నారు.
Also read: Infectious Diseases: అంటు వ్యాధులపై పోరుకు అమెరికా నిధులు
అంతకముందు... ఆల్ఫ్స్ పర్వత శ్రేణిలో జీ7 వేదికైన ఎల్మౌలో జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ మోదీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం అధినేతల ఫొటో సెషన్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోదీ వద్దకు స్వయంగా వచ్చి కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితరులు కూడా మోదీతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతూ కనిపించారు. కెనడా పీఎం జస్టిన్ ట్రూడో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడొ తదితరులతో మోదీ భేటీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సదస్సులో జి7 దేశాలైన అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, కెనడా, జపాన్‌తో పాటు అతిథులుగా భారత్, ఇండొనేసియా, దక్షిణాఫ్రికా, సెనెగల్, అర్జెంటీనా దేశాధినేతలు పాల్గొన్నారు.
Also read: Infectious Diseases: అంటు వ్యాధులపై పోరుకు అమెరికా నిధులు