Infectious Diseases: అంటు వ్యాధులపై పోరుకు అమెరికా నిధులు
Sakshi Education
Infectious Diseases: అంటువ్యాధులను అరికట్టడానికి భారతీయ సంస్థలకు ఆర్థిక సహాయం ప్రకటించిన దేశం?
అంటువ్యాధులను ముందుగానే పసిగట్టి, వాటిని అరికట్టడానికి మూడు అగ్రశ్రేణి భారతీయ వైద్య పరిశోధనా సంస్థలకు అమెరికా రూ.952 కోట్ల (12.20 కోట్ల డాలర్ల) ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ నిధులు అయిదేళ్ల కాలంలో దశల వారీగా భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్), జాతీయ వైరాలజీ పరిశోధన సంస్థ (ఎన్ ఐవీ), జాతీయ అంటువ్యాధుల నిరోధ సంస్థ (ఎన్ ఐఈ)కి అందిస్తారు. అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ కేంద్రం(సీడీసీ) ఇచ్చే ఈ నిధులు భారత్‌లో జంతువుల ద్వారా వ్యాపించగల వ్యాధులను ముందే పసిగట్టి నిరోధించడంలో మన పరిశోధనా సంస్థలకు ఉపకరిస్తాయి. ఈ ఏడాది సెప్టెంబరు 30 నుంచి నిధుల విడుదల ప్రారంభమవుతుంది.
Tomato Flu: దేశంలోని ఏ రాష్ట్రంలో టమాటో ఫ్లూ వైరస్‌ను గుర్తించారు?
Published date : 28 Jun 2022 05:27PM