Electric Vehicle: ప్రపంచ ఈవీ జాబితాలో భారత్‌కు 11వ ర్యాంక్
Sakshi Education
Electric Vehicle: ప్రపంచ ఈవీ జాబితాలో భారత్‌కు ఎన్నో ర్యాంక్ లభించింది?
India ranks 11th in Electric Vehicle Adoption
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వినియోగాన్ని వేగంగా అభివృద్ధి చేస్తున్న జాబితాలో..భారత్ 11వ ర్యాంకు సాధించింది. ప్రముఖ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి లిటిల్‌కు చెందిన గ్లోబల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రెడీనెస్ ఇండెక్స్(గెమ్‌రిక్స్–2022) ప్రకారం–ఈవీలను వేగంగా అడాప్ట్ చేసుకుంటున్న దేశాల జాబితాలో నార్వే అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితా ప్రధానంగా మార్కెట్, వినియోగదారులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం వంటి నాలుగు అంశాల ఆధారంగా రూపొందించడం జరిగింది. ఇందులో భారత్ ఈవీల వినియోగానికి సంసిద్ధంగా ఉన్న దేశాల్లో 11వ స్థానంలో ఉంది.