Electric Vehicles: కామన్ సర్వీస్ సెంటర్స్‌తో ఒప్పందం చేసుకున్న సంస్థ?
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ తాజాగా ప్రభుత్వ సంస్థ కామన్ సర్వీస్ సెంటర్స్‌తో (సీఎస్‌సీ) భాగస్వామ్యం కుదుర్చుకుంది. సీఎస్‌సీ సహకారంతో మహీంద్రా తయారీ ట్రియో, ఆల్ఫా వాహనాలను ఔత్సాహిక కస్టమర్లకు చేరుస్తారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేందుకు, మారుమూల ప్రాంతాల్లో కంపెనీ విస్తరణకు ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని మహీంద్రా ఎలక్ట్రిక్ తెలిపింది. ఉద్యోగావకాశాలను కల్పించేందుకు గ్రామీణ భారత్‌లో సీఎస్‌సీ కృషిచేస్తోంది.
ఇంటర్‌గ్లోబ్ బోర్డుకు గంగ్వాల్ రాజీనామా
ఇండిగో బ్రాండు విమానయాన కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ బోర్డుకు కంపెనీ సహవ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ రాజీనామా చేశారు. రానున్న ఐదేళ్లలో కంపెనీలోగల వాటాను నెమ్మదిగా తగ్గించుకోనున్నట్లు వెల్లడించారు.
చదవండి: ధన్‌బాద్ ఐఐటీ(ఐఎస్‌ఎం)తో ఎంవోయూ చేసుకున్న సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రభుత్వ సంస్థ కామన్ సర్వీస్ సెంటర్స్‌తో (సీఎస్‌సీ) భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ
ఎందుకు : ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేందుకు, మారుమూల ప్రాంతాల్లో కంపెనీ విస్తరణకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్