Research and Development: ధన్‌బాద్ ఐఐటీ(ఐఎస్‌ఎం)తో ఎంవోయూ చేసుకున్న సంస్థ?
మెటల్ రంగ దిగ్గజం జిందాల్ స్టెయిన్‌లెస్ లిమిటెడ్(జేఎస్‌ఎల్) తాజాగా ధన్‌బాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్)తో అవగాహనా ఒప్పందాన్ని (ఎంవోయూ) చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా ధన్‌బాద్ ఐఐటీ(ఐఎస్‌ఎం)తో కలిసి సంయుక్తంగా వివిధ ప్రాజెక్టులపై పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) కార్యక్రమాలను జేఎస్‌ఎల్ చేపట్టనుంది. రీసెర్చ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, పర్యావరణ పరిరక్షణ, నైపుణ్యాభివృద్ధి తదితరాలపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది. జార్ఖండ్ రాష్ట్రంలో ధన్‌బాద్ ఐఐటీ(ఐఎస్‌ఎం) ఉంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్–2022(ఐపీఎస్–2022) సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నియమితులయ్యాడు. 2020లోనే ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అయ్యర్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 2021 సీజన్ అనంతరం అయ్యర్‌ను ఢిల్లీ విడుదల చేయగా... మెగా వేలంలో కోల్‌కతా అయ్యర్‌ను రూ. 12 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది.
చదవండి: ఐఐటీ–హెచ్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్న సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ధన్‌బాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్)తో ఎంవోయూ చేసుకున్న సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : మెటల్ రంగ దిగ్గజం జిందాల్ స్టెయిన్‌లెస్ లిమిటెడ్(జేఎస్‌ఎల్)
ఎందుకు : వివిధ ప్రాజెక్టులపై పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) కార్యక్రమాలను చేపట్టేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్