5G Networks CoE: ఐఐటీ–హెచ్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్న సంస్థ?
ఇంజనీరింగ్, తయారీ, డిజిటల్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ సైయంట్ తాజాగా తమ ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను (సీవోఈ) ఏర్పాటు చేసింది. దీనికి పరిశోధన భాగస్వామిగా హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ–హెచ్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని సైయంట్ కేంద్రంలో ఈ సీవోఈని ఏర్పాటు చేశారు. ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు, పరీక్షించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఐఐటీ–హెచ్ అభివృద్ధి చేసిన 5జీ కోర్ ప్లాట్‌ఫామ్.. వివిధ అవసరాలకు ఏ విధంగా ఉపయోగపడగలదో ఇందులో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు.
చదవండి: ఎంఎస్‌ఎంఈ శాఖతో జట్టు కట్టిన ఈ–కామర్స్ కంపెనీ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ–హెచ్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్న సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : ఇంజనీరింగ్, తయారీ, డిజిటల్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ సైయంట్
ఎందుకు : హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్స్ సీవోఈకి పరిశోధన భాగస్వామిగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్