Skip to main content

One District One Product: ఎంఎస్‌ఎంఈ శాఖతో జట్టు కట్టిన ఈ–కామర్స్‌ కంపెనీ?

Amazon

దేశంలో వస్తువుల ఉత్పత్తి పెంపునకు ఈ–కామర్స్‌ కంపెనీ అమెజాన్‌తో కలిసి పనిచేయనున్నట్టు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ(ఎంఎస్‌ఎంఈ శాఖ) మంత్రి నారాయణ్‌ రాణే తెలిపారు. అందుబాటు ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేయనున్నట్టు చెప్పారు. అమెజాన్‌ వేదికగా ఇండియా వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ (ఓడీఓపీ) బజార్‌ను ఫిబ్రవరి 15న న్యూఢిల్లీలో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఇండియా ఓడీఓపీ బజార్‌లో ప్రాంతీయ భాషల్లో దేశవ్యాప్తంగా పలు జిల్లాల వారీగా పేరొందిన ఉత్పత్తుల వివరాలు ఉంటాయన్నారు.

యస్‌ బ్యాంక్‌ అగ్రి ఇన్‌ఫినిటీ కార్యక్రం ఉద్దేశం?

ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌.. ఆహారం, వ్యవసాయ రంగాలకు దన్నుగా డిజిటల్‌ ఫైనాన్సింగ్‌ సొల్యూషన్ల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. స్టార్టప్‌లకు ప్రోత్సాహకరంగా ప్రారంభించిన ఈ పథకం కింద కొన్ని ఎంపిక చేసిన వెంచర్స్‌కు ఈక్విటీ పెట్టుబడులను సైతం అందించనుంది. ‘‘యస్‌ బ్యాంక్‌ అగ్రి ఇన్‌ఫినిటీ’’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా డిజిటల్‌ ఫైనాన్షియల్‌ సొల్యూషన్స్‌ అభివృద్ధికి స్టార్టప్‌లతో కలసి పనిచేయనున్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది.

చ‌ద‌వండి: ఆర్‌బీఐ ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవం థీమ్‌ ఏమిటీ?

క్విక్‌ రివ్యూ :
ఏమిటి    :
ఇండియా వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ (ఓడీఓపీ) బజార్‌ ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు    : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ(ఎంఎస్‌ఎంఈ శాఖ) మంత్రి నారాయణ్‌ రాణే
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : దేశంలో వస్తువుల ఉత్పత్తి పెంపునకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 Feb 2022 04:16PM

Photo Stories