Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 19th కరెంట్ అఫైర్స్
National Logistics Policy 2022: దేశంలో నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం.. 5,000కు పైగా ‘స్కిల్ హబ్స్’
దేశంలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి 5,000కుపైగా ‘స్కిల్ హబ్స్’ ప్రారంభించబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కాలానుగుణంగా నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడమే యువతకు తారకమంత్రం కావాలని ఉద్బోధించారు. ఆయన సెప్టెంబర్ 17న ఐటీఐ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఉద్యోగ అవకాశాలూ పెరుగుతున్నాయి. కనుక యువత తమ నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. వారి రంగాల్లో మార్పులను గమనిస్తూండాలి’’ అన్నారు. ‘‘మా హయాంలో గత ఎనిమిదేళ్లలో దేశంలో కొత్తగా దాదాపు 5,000 ఐటీఐలను ప్రారంభించాం. 4 లక్షల సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
రవాణా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి ఉద్దేశించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని మోదీ ఆవిష్కరించారు. ‘‘13–14 శాతమున్న రవాణా లాజిస్టిక్స్ వ్యయాన్ని 7.5 శాతం కంటే దిగువకు తేవడంతో పాటు సమయం, డబ్బు మరింతగా ఆదా అయ్యేలా చూడటమే దీని లక్ష్యం.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 17th కరెంట్ అఫైర్స్
Kuno National Park: 70 ఏళ్ల తర్వాత భారత్ తిరిగొచ్చిన చీతాలు.. కునో నేషనల్ పార్కులో వదిలిన మోదీ
షోపూర్ (మధ్యప్రదేశ్): 70 ఏళ్ల కింద భారత్‌లో అంతరించిన చీతా జాతి మళ్లీ దేశంలోకి అడుగు పెట్టింది. తన పుట్టినరోజు సందర్భంగా ఆయనే వాటిని కునో పార్కులోకి వదిలిపెట్టారు.
‘‘అవి మన అతిథులు. కొద్ది నెలల్లో కునో పార్కును తమ నివాసంగా మార్చుకుంటాయి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు.
‘మిషన్ చీతా’ పేరిట ఆఫ్రికాలోని నమీబియా నుంచి కేంద్రం రప్పించిన 8 చీతాలు ప్రత్యేక విమానంలో 10 గంటలు సుదీర్ఘ ప్రయాణం చేసి సెప్టెంబర్ 17న గ్వాలియర్ చేరుకున్నాయి. అక్కడినుంచి వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లలో కునోకు తరలాయి.
Also read: Insurance: విపత్తుల్లోనూ బీమా ధీమా!.. వాహన, హోమ్ ఇన్సూరెన్స్‌తో పూర్తి రక్షణ
ఇలా తరలించారు...
నమీబియా నుంచి వచ్చిన 8 చీతాల్లో 3 మగవి కాగా 5 ఆడవి. వీటి వయసు 30 నుంచి 66 నెలలు. వాటికి మత్తు ఇంజక్షన్లిచ్చి ప్రత్యేక చెక్క బోన్లలో విమానంలో తరలించారు. 8,000 కిలోమీటర్ల సుదీర్ఘ ఖండాంతర ప్రయాణం కావడంతో వాంతులు చేసుకోకుండా ఖాళీ కడుపుతో తీసుకొచ్చారు. కునో పార్కులో ఎన్‌క్లోజర్లలోకి వదిలాక ఆహారమిచ్చారు. నెల రోజుల క్వారెంటైన్ అనంతరం మరో రెండు నుంచి నాలుగు నెలల పాటు చీతాలను పెద్ద ఎన్‌క్లోజర్లలో ఉంచి పర్యవేక్షిస్తారు. తర్వాత స్వేచ్ఛగా వదిలేస్తారు. చీతాల ఉనికిని నిరంతరం ట్రాక్ చేసేందుకు వాటికి రేడియో ట్యాగింగ్ చేశారు. చివరిసారిగా 1947లో నేటి ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోస్థానిక రాజు మూడు చీతాలను వేటాడాడు. అంతటితో భారత్‌లో వాటి కథ ముగిసిపోయింది.
Andhra Pradesh Economy: తొలిసారిగా రూ.2 లక్షలు దాటిన ఏపీ తలసరి ఆదాయం
తొలిసారిగా ఏపీ తలసరి ఆదాయం రెండు లక్షల రూపాయలు దాటింది. 2021 – 22కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఇండియా విడుదల చేసిన ఆర్థిక వ్యవస్థ గణాంకాల నివేదికలో వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయ వివరాలను వెల్లడించింది. ఆర్బీఐ విడుదల చేసిన ప్రొవిజనల్ గణాంకాల మేరకు రాష్ట్ర తలసరి ఆదాయం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,07,771కి పెరిగింది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ.1,50,007 మాత్రమే నమోదు కావడం గమనార్హం.
Also read: FM Nirmala Sitharaman: ఫైనాన్షియల్ రంగంపై నిరంతర అప్రమత్తత: ఎఫ్‌ఎస్‌డీసీ
ఆర్థిక సంవత్సరం (2021–22)లో రాష్ట్ర తలసరి ఆదాయం ఏకంగా 17.57 శాతం పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 31,064 పెరిగింది.
మూడేళ్లలో 34.88 శాతం పెరుగుదల
గత సర్కారు దిగిపోయే నాటికి 2018 – 19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 మాత్ర మే ఉండగా 2021–22లో ఏకంగా రూ.2,07,771కి పెరిగింది. వైఎస్సార్‌సీపీ పాలనలో మూడేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం 34.88 శాతం మేర పెరిగినట్లు స్పష్టమవుతోంది.
Also read: Irrigation Project Loans: రాష్ట్ర విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకు మళ్లీ రుణాలు
AP State Economy: ‘నికరం’గా ఆర్థికవృద్ధి!
రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ మూ డేళ్లుగా వృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఆర్థిక వృద్ధికి ప్రధానంగా వ్యవసాయం, తయారీ, రియల్ ఎస్టేట్ రంగాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ధరలతో పోల్చి చూస్తే 2021–22 ఆర్థిక ఏడాది నాటికి రాష్ట్ర ఆర్థిక నికర విలువ (నెట్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్) రికార్డు స్థాయిలో రూ.10.85 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఆర్థిక మందగమనం, వరుసగా రెండేళ్ల పాటు కరోనా సంక్షోభ పరిస్థితులను అధిగమించి గత మూడేళ్లలో రాష్ట్ర ఆర్థిక నికర విలువ 37.28 శాతం మేర పెరిగింది.
Also read: India's economy: భారత్ వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం: ఫిచ్ అంచనా తగ్గింపు
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి రూపొందించిన గణాంకాల నివేదికలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ అంశాలను వెల్లడించింది.
సంక్షోభంలో అండగా..
2021–22 ఆర్థిక ఏడాదిలో వివిధ రాష్ట్రాలు ఆర్ధిక కార్యకలాపాల ద్వారా జోడించిన రాష్ట్ర నికర విలువలను ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లోనూ వేగంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టమైంది. ప్రస్తుత ధరల ప్రకారం 2018–19లో రాష్ట్ర ఆర్థిక నికర విలువ రూ.7.90 లక్షల కోట్లు మాత్రమే ఉండగా 2021–22 నాటికి రూ.10.85 లక్షల కోట్లకు చేరిందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. మూడేళ్లలో నికర రాష్ట్ర ఆర్థిక విలువ రూ.2.94 లక్షల కోట్లు పెరిగింది. అంటే మూడేళ్లలో 37.28 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. సగటు వార్షిక వృద్ధి 12.42 శాతంగా ఉంది.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 16th కరెంట్ అఫైర్స్
జీఎస్‌డీపీ రూ.12,01,736 కోట్లు
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2021–22 ఆర్థిక ఏడాదిలో ప్రస్తుత ధరల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.12,01,736 కోట్లుగా నమోదైంది.
Gogo Rock Formation: ఈ గుండె వయసు... 38 కోట్ల ఏళ్లు!
వందలు, వేలు కాదు...ఏకంగా 38 కోట్ల ఏళ్ల కిందటి పురాతన గుండెను ఆ్రస్టేలియాలో కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుండెగా నిర్ధారించారు. అంతరించిపోయిన ఎన్నో జీవజాతుల రహస్యాలను ఛేదిస్తున్న పరిశోధకులు.. పశ్చిమ ఆ్రస్టేలియాలోని కింబర్లే ప్రాంతంలో ‘గోగో రాక్ ఫార్మేషన్’లో తవ్వకాలు జరుపుతుండగా ఈ గుండె శిలాజం దొరికింది. దీంతోపాటు కాలేయం, పొట్ట, పేగులు కూడా లభించాయి. ఈ అవయవాలు సొరచేపను పోలి ఉన్నాయని, ఇవి గోగో జాతికి చెందిన చేపవి అయి ఉంటాయని పెర్త్‌లోని కర్టిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
Also read: HSL: హిందుస్థాన్ షిప్‌యార్డ్ కొత్త ఆవిష్కరణ
Astronomy photo: తోకచుక్క చెదురుతున్న వేళ...
సౌర గాలికి వ్యతిరేకంగా ప్రయాణించే కామెట్ లియోనార్డ్ తోకచుక్క తాలూకు తోక భాగం సౌర గాలుల ధాటికి చెదిరిపోతున్న దృశ్యమిది. ఆస్ట్రియాకు చెందిన గెరాల్డ్ రేమన్ తీసిన ఈ ఫొటోకు ఆస్ట్రానమీ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డు దక్కింది.
నేపథ్యంలో నక్షత్రాలు ఫొటో అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి.
దైవనేత్రం
ఇది చైనా ఫొటోగ్రాఫర్ వీటాంగ్ లియాంగ్ తీసిన హెలిక్స్ నెబ్యులా తాలూకు ఫొటో. అంతరిక్షం నుంచి భూమిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టుగా ఉన్నందున దీనికి దైవనేత్రం అని పేరు పెట్టారట!
మన పొరుగిల్లు
ఇది మన పాలపుంతకు అతి దగ్గరగా ఉండే ఆండ్రోమెడా గెలాక్సీ.
చైనాకు చెందిన ఇద్దరు 14 ఏళ్ల ఔత్సాహిక బాలలు తీసిన ఈ ఫొటోకూ విజేతల కేటగిరీలో చోటు దక్కింది.
2022 World Wrestling Championships: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగో పతకం సాధించిన భారత రెజ్లర్
బెల్‌గ్రేడ్ (సెర్బియా): సెప్టెంబర్ 18న ముగిసిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో కాంస్య పతకంతో మెరిశాడు. కాంస్య పతకం సాధించాలంటే తప్పనిసరిగా రెండు వరుస బౌట్‌లలో గెలవాల్సిన బజరంగ్ తన సత్తా చాటుకున్నాడు. బజరంగ్‌ను క్వార్టర్ ఫైనల్లో ఓడించిన అమెరికా రెజ్లర్ జాన్ మైకేల్ ఫైనల్ చేరడంతో బజరంగ్‌కు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం లభించింది. సెప్టెంబర్ 18న జరిగిన ‘రెపిచాజ్’ తొలి బౌట్‌లో 28 ఏళ్ల బజరంగ్ 7–6తో వాజ్‌జెన్ తెవాన్యన్ (అర్మేనియా)పై నెగ్గి కాంస్య పతక పోరుకు అర్హత సాధించా డు.
ఏడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ బజరంగ్ ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్‌లో నాలుగు పతకాలు సాధించి అత్యంత విజయవంతమైన భారత రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. 2013లో 60 కేజీల విభాగంలో బజరంగ్ కాంస్యం నెగ్గగా... 2018లో 65 కేజీల విభాగంలో రజతం, 2019లో కాంస్యం సాధించాడు.
Football Durand Cup: విజేతగా బెంగళూరు FC
భారత్‌లో అత్యంత పురాతన ఫుట్‌బాల్ టోర్నీ డ్యూరాండ్ కప్ టైటిల్‌ను బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తొలిసారి సాధించింది. సెప్టెంబర్ 18న జరిగిన ఫైనల్లో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి నాయకత్వంలోని బెంగళూరు 2–1తో ముంబై సిటీ ఎఫ్‌సీపై గెలిచింది. బెంగళూరు తరఫున శివశక్తి (10వ ని.లో), అలన్ కోస్టా (61వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ముంబై జట్టుకు అపుయా (30వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. చాంపియన్ బెంగళూరు కు రూ. 60 లక్షలు... రన్నరప్ ముంబై జట్టుకు రూ. 40 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.
Also read: SAFF U17 Championships: ‘శాఫ్’ ఫుట్‌బాల్ చాంప్ భారత్
Financial Year:ప్రత్యక్ష పన్ను వసూళ్లు 30 శాతం అప్
ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 17తో ముగిసిన కాలానికి స్థూలంగా 30 శాతం పురోగతితో రూ.8.36 లక్షల కోట్లకు చేరాయి. మహమ్మారి తర్వాత వేగంగా పుంజుకుంటున్న ఎకానమీ, ముందస్తు పన్ను చెల్లింపులు దీనికి కారణమని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే, విలువ రూ.6,42,2876 కోట్ల నుంచి రూ.8,36,225 కోట్లకు చేరినట్లు ప్రకటన వివరించింది. మొత్తం వసూళ్లలో కార్పొరేట్ రంగం వాటా రూ.4.36 లక్షల కోట్లుకాగా, వ్యక్తిగత పన్ను విభాగం వాటా రూ.3.98 లక్షల కోట్లు. ఒక్క అడ్వాన్స్ పన్ను విసూళ్లు 17 శాతం వృద్ధితో రూ.2.29 లక్షల కోట్ల నుంచి రూ.2.95 లక్షల కోట్లకు చేరాయి.
Also read: India's economy: భారత్ వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం: ఫిచ్ అంచనా తగ్గింపు
రిఫండ్స్ రూ.1.36 లక్షల కోట్లు
ఇక మొత్తం వసూళ్లలో రిఫండ్స్ విలువ రూ.1.36 లక్షల కోట్లు. దీనితో నికరంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23 శాతం వృద్ధితో రూ.7 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణాన్ని రూ.14.20 లక్షల కోట్లుగా కేంద్ర బడ్జెట్ అంచనా వేస్తోంది. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షలుకాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు.
Also read: WPI: టోకు ద్రవ్యోల్బణం తగ్గినా, ‘తీవ్రమే’ ఆగస్టులో 12.41 శాతం
Startups: విశాఖలో దేశంలోనే తొలి ఇండస్ట్రీ 4.0 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సిద్ధం
పారిశ్రామికరంగంలో నాలుగో తరం టెక్నాలజీ ఆవిష్కరణలకు విశాఖ వేదిక అవుతోంది. విశాఖ ఉక్కు (ఆర్‌ఐఎన్‌ఎల్)తో కలిసి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) సంయుక్తంగా ‘కల్పతరువు’ పేరుతో ఏర్పాటుచేసిన ఇండస్ట్రీ–4.0 సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ) కార్యకలాపాలు సెప్టెంబర్ 20 నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. దేశంలోని స్టార్టప్‌లను ఆకర్షించేలా ఓపెన్ చాలెంజ్ ప్రోగ్రాం–1 (ఓసీపీ–1)ను కల్పతరువు సీఓఈ ప్రకటించింది.
Also read: Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్ జగన్ 8 కంపెనీలకు శంకుస్థాపన
విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు ఆర్‌ఐఎన్‌ఎల్, ఎన్‌టీపీసీ, వైజాగ్ పోర్టు, హెచ్‌పీసీఎల్ వంటి పరిశ్రమల్లో మానవ వనరుల వినియోగం తగ్గించి ఖర్చులను నియంత్రించే నూతన టెక్నాలజీ ఆవిష్కరణలను పెంచి తద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కల్పతరువు సీవోఈని ఏర్పాటుచేసినట్లు ఎస్‌టీపీఐ విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందులో భాగంగా.. ముందుగా విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ఆరు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఓసీపీ–1 పేరుతో స్టార్టప్‌లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సమస్యకు ఇండస్ట్రీ–4 టెక్నాలజీతో చక్కటి పరిష్కరం చూపిన ప్రోటోటైప్ స్టార్టప్‌ను ఎంపికచేసి రూ.4 లక్షలు బహుమతిగా ఇవ్వడమే కాక, కల్పతరువు సీవోఈ ద్వారా ప్రాజెక్టు ఫండింగ్ సౌకర్యం కలి్పస్తారు. పరిశ్రమల్లో ఆటోమేషన్ పెంచేందుకు బిలియన్ డాలర్లు వ్యయం చేస్తున్నారని, ఇందులో నూతన ఆవిష్కరణలకు విశాఖ వేదిక కానుందని కల్పతరువు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ గ్రూపు సభ్యుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు తెలిపారు.
Also read: Family doctor: ఫోన్ కాల్‌తో వైద్య సేవలు.. ఫ్యామిలీ డాక్టర్‌కు ప్రత్యేక యాప్
రూ.20 కోట్లతో ‘కల్పతరువు’
సుమారు రూ.20 కోట్లతో కల్పతరువు ఇండస్ట్రీ–4 COE అభివృద్ధి చేస్తున్నారు. ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ సీవోఈ పనులు వేగంగా జరుగుతున్నట్లు సురేష్ తెలిపారు. ఇప్పటికే ల్యాబ్ పనులు మొదలయ్యాయని, రెండు నెలల్లో ఈ సీవోఈని అధికారికంగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఓసీపీ–1లో ఎంపికైన స్టార్టప్‌లతో కల్పతరువును ప్రారంభించడానికి ఓపెన్ ఛాలెంజ్ ప్రోగ్రాంను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ పోటీలో గెలిచిన స్టార్టప్‌లు కల్పతరువులో ఏర్పాటుచేసిన ల్యాబొరేటరీ, ఇంక్యుబేషన్ వినియోగించుకోవడంతోపాటు ఎస్‌టీపీఐ నుంచి ఫైనాన్సింగ్, మానిటరింగ్ సహకారం లభిస్తాయి.
Also read: SIPB: రాష్ట్రంలో 36,380 మందికి ఉపాధి లభించేలా రూ.1,26,622.23 కోట్లు పెట్టుబడులు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP