FM Nirmala Sitharaman: ఫైనాన్షియల్ రంగంపై నిరంతర అప్రమత్తత: ఎఫ్‌ఎస్‌డీసీ
Sakshi Education
అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా నిలువరించడానికి ఫైనాన్షియల్ రంగం, దానికి ఎదురయ్యే ఇబ్బందులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని అత్యున్నత స్థాయి ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) సమావేశం ఉద్ఘాటించింది.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇక్కడ జరిగిన ఈ సమావేశం, ఎకానమీపై కీలక సమీక్ష జరిపింది. సకాలంలో తగిన చర్యలు తీసుకునేలా వ్యవస్థల సంసిద్ధత అవసరాన్ని స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రులు, రెగ్యులేటర్ల చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also read: Henley & Partners Group Report: న్యూయార్క్, టోక్యో... కుబేరుల అడ్డాలు.. ప్రపంచంలో 25వ స్థానంలో ముంబై
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 16 Sep 2022 05:44PM