Henley & Partners Group Report: న్యూయార్క్, టోక్యో... కుబేరుల అడ్డాలు.. ప్రపంచంలో 25వ స్థానంలో ముంబై
Sakshi Education
ప్రపంచంలో అపర కుబేరులు ఎక్కువగా ఉన్న నగరాల్లో న్యూయార్క్, టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి.
రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ ‘హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ గ్రూప్’ తాజా నివేదికలో ఈ మేరకు వెల్లడించింది. ధనవంతులకు అడ్డా అయిన మొదటి 10 నగరాల్లో 5 నగరాలు అమెరికాలోనే ఉండడం విశేషం. ఒక మిలియన్ డాలర్లు (రూ.7.94 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి ఉంటే మిలియనీర్లుగా పరిగణిస్తారు.
Also read: Population Decline: జనాభా తగ్గుదల ఆందోళనకరం... ప్రపంచ దేశాల ముందు కొత్త సవాళ్లు
- 2022లో తొలి అర్ధభాగంలో న్యూయార్క్ సిటీ 12 శాతం మిలియనీర్లను కోల్పోయింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో మిలియనీర్లు 4 శాతం పెరిగారు. లండన్‌లో 9 శాతం తగ్గిపోయారు.
- సౌదీ అరేబియా రాజధాని రియాద్, యునైటెట్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని షార్జాలో సంపన్నుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది.
- అబూ దాబీ, దుబాయ్ సిటీలు బడా బాబులను ఆకర్శిస్తున్నాయి. ధనవంతులు ఆయా నగరాల్లో నివసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అక్కడ తక్కువ పన్నులు, కొత్త కొత్త నివాస పథకాలు అమల్లోకి వస్తుండడమే ఉండడమే ఇందుకు కారణం.
- రష్యా ధనవంతులు యూఏఈకి వస్తున్నారు.
- సంపన్నుల నగరాల జాబితాలో చైనాలోని బీజింగ్, షాంఘై సిటీలు తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లోని ముంబై నగరం 25వ స్థానంలో నిలిచింది.
- ఈ ఏడాది సంపద తరలిపోతున్న దేశాల్లో రష్యా తర్వాత రెండో స్థానం చైనాదేనని ‘హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ గ్రూప్’ అంచనా వేసింది.
Also read: Asia's Richest Woman: ఆసియా సంపన్న మహిళగా సావిత్రి జిందాల్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 15 Sep 2022 06:19PM