Skip to main content

Irrigation Project Loans: రాష్ట్ర విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకు మళ్లీ రుణాలు

వివిధ ప్రాజెక్టులు, పథకాలకు రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం లభించింది.
Irrigation project Kaleshwaram Corporation bills
Irrigation project Kaleshwaram Corporation bills

కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఏప్రిల్‌ నుంచి వివిధ సాగునీటి, విద్యుత్‌ ప్రాజెక్టులకు రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ) సంస్థలు రుణాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా సదరు రుణాల పునరుద్ధరణపై ఈ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి ఆర్‌ఈసీ నుంచి రూ.992.25 కోట్ల రుణం విడుదలైంది. 

Also read: Telangana : తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరు.. అలాగే పార్లమెంట్‌ కొత్త భవనానికి కూడా..

కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ (కేఐపీసీ)కు కూడా రుణాలను పునరుద్ధరించడానికి ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీలు ముందుకు వచ్చాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా సమీకరిస్తున్న రుణాలతో.. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను సమర్పించిన తర్వాత.. తాజా రుణాలు విడుదల కానున్నాయని అధికారులు వెల్లడించారు. పీఎఫ్‌సీ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.340 కోట్ల రుణం విడుదలైనట్టు వార్తలు వచ్చినా అధికారులు ధ్రువీకరించలేదు. గత ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు జరిగిన యాదాద్రి విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులకు సంబంధించి రూ.992.25 కోట్ల రుణాన్ని ఆర్‌ఈసీ రెండు రోజుల కింద విడుదల చేయగా.. జెన్‌కో వెంటనే నిర్మాణ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు బిల్లుల బకాయిలను చెల్లించిందని అధికార వర్గాలు తెలిపాయి. రుణాల పునరుద్ధరణ జరగడంతో యాదాద్రి థర్మల్‌ కేంద్రం నిర్మాణాన్ని వచ్చే ఏడాది చివరిలోగా పూర్తి చేయగలమని జెన్‌కో చెబుతోంది.

Also read: Satavahana History Important Bitbank in Telugu: ఇక్ష్వాకుల రాజ చిహ్నం ఏది?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 16 Sep 2022 05:39PM

Photo Stories