Satavahana History Important Bitbank in Telugu: ఇక్ష్వాకుల రాజ చిహ్నం ఏది?
శాతవాహన అనంతర యుగం
1. సోమశేఖర శర్మ శాతవాహనుల తర్వాత ఏ పాలకుల కాలం వరకు 'అజ్ఞాత యుగం'గా పేర్కొన్నాడు?
1) ఇక్ష్వాకులు
2) బాదామీ చాళుక్యులు
3) వాకాటకులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 2
2. హర్షుడికి సమకాలికంగా తెలంగాణ ప్రాంతాన్ని పులకేశి పాలించినట్లు పేర్కొన్నవారెవరు?
1) మల్లంపల్లి సోమశేఖర శర్మ
2) వట్టికోట ఆళ్వారుస్వామి
3) ఆదిరాజు వీరభద్రరావు
4) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 4
3. 'శ్రీ పర్వతీయులు' అని ఎవరిని పేర్కొంటారు?
1) బాదామీ చాళుక్యులు
2) వాకాటకులు
3) ఇక్ష్వాకులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 3
4. ఇక్ష్వాకులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు?
1) వాకాటకులు
2) శాతవాహనులు
3) విష్ణుకుండినులు
4) బాదామీ చాళుక్యులు
- View Answer
- సమాధానం: 2
చదవండి: Satavahana Dynasty Bitbank in Telugu: గాథాసప్తశతి గ్రంథ రచయిత ఎవరు?
5. స్వతంత్రంగా ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించినవారెవరు?
1) వీరపురుషదత్తుడు
2) ఎహుబల శాంతమూలుడు
3) రుద్ర పురుషదత్తుడు
4) వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు
- View Answer
- సమాధానం: 4
6. పురాణాల ప్రకారం ఇక్ష్వాక రాజులు ఎంతమంది?
1) 6
2) 7
3) 8
4) 4
- View Answer
- సమాధానం: 2
7. ఇక్ష్వాక రాజుల పాలనా క్రమం?
1) రుద్రపురుషదత్తుడు, శ్రీశాంతమూలుడు, వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు, వీరపురుషదత్తుడు
2) వీరపురుషదత్తుడు, ఎహుబల శాంతమూలుడు, శ్రీశాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు
3) వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు, వీరపురుషదత్తుడు, ఎహుబల శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు
4) ఎహుబల శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు, వీరపురుషదత్తుడు, శ్రీశాంతమూలుడు
- View Answer
- సమాధానం: 3
8. ఇక్ష్వాకుల రాజధాని ఏది?
1) విజయపురి
2) నేలకొండపల్లి
3) ధాన్యకటకం
4) కోటిలింగాల
- View Answer
- సమాధానం: 1
9. బి.ఎన్.శాస్త్రి ప్రకారం 'దక్షిణాపథపతి' అనే బిరుదున్న రాజు ఎవరు?
1) రుద్రపురుషదత్తుడు
2) శ్రీశాంతమూలుడు
3) ఎహుబల శాంతమూలుడు
4) వీరపురుషదత్తుడు
- View Answer
- సమాధానం: 3
చదవండి: Telangana History Important Bits: తొలిసారిగా తెలుగులో శాసనాలు వేయించిన కాకతీయ రాజెవరు?
10. ఉజ్జయినీ పాలకుడైన శకరాజు కుమార్తెను వివాహమాడిన రాజు?
1) వీరపురుషదత్తుడు
2) రుద్రపురుషదత్తుడు
3) ఎహుబల శాంతమూలుడు
4) శ్రీశాంతమూలుడు
- View Answer
- సమాధానం: 2
11. ఏ రాజవంశ పాలనలో 'ఎలిసిరి' అనే ఉద్యోగి ఉండేవాడు?
1) ఇక్ష్వాకులు
2) వాకాటకులు
3) విష్ణుకుండినులు
4) బాదామీ చాళుక్యులు
- View Answer
- సమాధానం: 1
12. 'హలసహస్త్ర' బిరుదాంకితుడెవరు?
1) రుద్రపురుషదత్తుడు
2) వీరపురుషదత్తుడు
3) శ్రీశాంతమూలుడు
4) ఎహుబల శాంతమూలుడు
- View Answer
- సమాధానం: 3
13. ఇక్ష్వాకుల రాజ చిహ్నం ఏది?
1) మయూరం
2) గుర్రం
3) వృషభం
4) సింహం
- View Answer
- సమాధానం: 4
14. వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు అవలంబించిన మతం ఏది?
1) జైనం
2) వైదికం
3) శైవం
4) బౌద్ధం
- View Answer
- సమాధానం: 2
చదవండి: Satavahana History Important Bitbank in Telugu: శాతవాహనుల రాజభాష ఏది?
15. ఎవరి పాలనా కాలాన్ని 'బౌద్ధమతానికి స్వర్ణయుగం'గా పేర్కొంటారు?
1) ఎహుబల శాంతమూలుడు
2) శ్రీశాంతమూలుడు
3) వీరపురుషదత్తుడు
4) రుద్రపురుషదత్తుడు
- View Answer
- సమాధానం: 3
16. ఇక్ష్వాకులు పోషించిన భాష ఏది?
1) తెలుగు
2) సంస్కృతం
3) పైశాచీ
4) ప్రాకృతం
- View Answer
- సమాధానం: 4
17. ఇంద్రపాలనగర శాసనాన్ని ఎవరు వేయించారు?
1) విక్రమేంద్రభట్టారక వర్మ
2) విక్రమేంద్రవర్మ
3) మూడో మాధవవర్మ
4) రెండో మాధవవర్మ
- View Answer
- సమాధానం: 1
18. మేనత్త కూతురును వివాహం చేసుకోవడం ప్రధానంగా ఏ రాజవంశంలో కనిపిస్తుంది?
1) ఇక్ష్వాకులు
2) బాదామీ చాళుక్యులు
3) విష్ణుకుండినులు
4) శాతవాహనులు
- View Answer
- సమాధానం: 1