Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 16th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu September 16th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu September 16th 2022
Current Affairs in Telugu September 16th 2022

Irrigation Project Loans: రాష్ట్ర విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకు మళ్లీ రుణాలు

వివిధ ప్రాజెక్టులు, పథకాలకు రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఏప్రిల్‌ నుంచి వివిధ సాగునీటి, విద్యుత్‌ ప్రాజెక్టులకు రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ) సంస్థలు రుణాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా సదరు రుణాల పునరుద్ధరణపై ఈ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి ఆర్‌ఈసీ నుంచి రూ.992.25 కోట్ల రుణం విడుదలైంది. 

Also read: Telangana : తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరు.. అలాగే పార్లమెంట్‌ కొత్త భవనానికి కూడా..

కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ (కేఐపీసీ)కు కూడా రుణాలను పునరుద్ధరించడానికి ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీలు ముందుకు వచ్చాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా సమీకరిస్తున్న రుణాలతో.. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను సమర్పించిన తర్వాత.. తాజా రుణాలు విడుదల కానున్నాయని అధికారులు వెల్లడించారు. పీఎఫ్‌సీ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.340 కోట్ల రుణం విడుదలైనట్టు వార్తలు వచ్చినా అధికారులు ధ్రువీకరించలేదు. గత ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు జరిగిన యాదాద్రి విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులకు సంబంధించి రూ.992.25 కోట్ల రుణాన్ని ఆర్‌ఈసీ రెండు రోజుల కింద విడుదల చేయగా.. జెన్‌కో వెంటనే నిర్మాణ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు బిల్లుల బకాయిలను చెల్లించిందని అధికార వర్గాలు తెలిపాయి. రుణాల పునరుద్ధరణ జరగడంతో యాదాద్రి థర్మల్‌ కేంద్రం నిర్మాణాన్ని వచ్చే ఏడాది చివరిలోగా పూర్తి చేయగలమని జెన్‌కో చెబుతోంది.

Also read: Satavahana History Important Bitbank in Telugu: ఇక్ష్వాకుల రాజ చిహ్నం ఏది?

India's economy: భారత్‌ వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం: ఫిచ్‌ అంచనా తగ్గింపు

భారత్‌ ఎకానమీ వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పరిమితం అవుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ– ఫిచ్‌ అంచనావేసింది. ఈ మేరకు జూన్‌లో వేసిన తొలి 7.8 శాతం వృద్ధి అంచనాలకు 80 బేసిస్‌ పాయింట్లు లేదా 0.80 శాతం (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) కోతపెట్టింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు,  ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు తమ తాజా అంచనాలకు కారణంగా చూపింది. 

2023–24 ఆర్థిక సంవత్సరం తొలి అంచనా 7.4 శాతాన్ని తాజాగా 6.7 శాతానికి కుదిస్తున్నట్లు కూడా ఫిచ్‌ తాజా గ్లోబల్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ పేర్కొంది. కాగా, 2022లో ప్రపంచ వృద్ధి రేటు 2.4 శాతానికి పరిమితం అవుతుందని ఫిచ్‌ పేర్కొంది. తొలి అంచనాలకన్నా ఇది అరశాతం (0.5 శాతం) తక్కువ.  

Also read: Satavahana History Important Bitbank in Telugu: శాతవాహనుల రాజభాష ఏది?

FM Nirmala Sitharaman: ఫైనాన్షియల్‌ రంగంపై నిరంతర అప్రమత్తత: ఎఫ్‌ఎస్‌డీసీ

 

అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా నిలువరించడానికి ఫైనాన్షియల్‌ రంగం, దానికి ఎదురయ్యే ఇబ్బందులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని అత్యున్నత స్థాయి ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) సమావేశం ఉద్ఘాటించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన ఇక్కడ జరిగిన ఈ సమావేశం, ఎకానమీపై కీలక సమీక్ష జరిపింది. సకాలంలో తగిన చర్యలు తీసుకునేలా వ్యవస్థల సంసిద్ధత అవసరాన్ని స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రులు, రెగ్యులేటర్ల చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Also read: Henley & Partners Group Report: న్యూయార్క్, టోక్యో... కుబేరుల అడ్డాలు.. ప్రపంచంలో 25వ స్థానంలో ముంబై

62nd SIAM Annual Convention: పర్యావరణ అనుకూల పరిష్కారాలు కావాలి.. ఆటో రంగానికి ప్రధాని మోదీ సూచన

 

పర్యావరణాన్ని కాపాడుకునేందుకు, దేశ స్వావలంబనకు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహన ఆవిష్కరణలపై ఆటోమొబైల్‌ పరిశ్రమ దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) 62వ వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధాని లిఖితపూర్వక సందేశం ఇచ్చారు. 

Also read: Quiz of The Day (September 16, 2022): ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?

దీన్ని సియామ్‌ ప్రెసిడెంట్‌ కెనిచి అయుకవ చదవి వినిపించారు. ప్రతి రంగంలోనూ స్వావలంబన సాధించాల్సిన అమృత కాల అవకాశం మన ముందుందని పేర్కొంటూ, అందుకు ఆటోమొబైల్‌ రంగం కూడా అతీతం కాదన్నారు. ఉపాధి కల్పన, దేశ సమగ్ర ఆర్థికాభివృద్ధిలో ఆటోమొబైల్‌ పరిశ్రమ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ఆటోమొబైల్‌ రంగానికి భవిష్యత్తు బ్లూప్రింట్‌ను అభివృద్ధి చేసే విషయంలో పరిశ్రమ నిపుణులు, తయారీదారులు, విధానకర్తలు వార్షిక సదస్సులో భాగంగా చర్చలు నిర్వహించాలని సూచించారు. వాహన తయారీలో నాలుగో అతిపెద్ద దేశంగా భారత్‌ అవతరించడంలో పరిశ్రమ పాత్రను మెచ్చుకున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, ఆటోమొబైల్‌ పరిశ్రమ సాధించిన ఈ విజయాలు దేశ ఆర్థిక పునరుజ్జీవానికి తోడ్పడినట్టు చెప్పారు. తయారీదారులను ప్రోత్సహించడం ద్వారా భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. మానవాభివృద్ధిలో రవాణా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశ వృద్ధికి నాణ్యమైన, సౌకర్యమైన రవాణా కీలకమన్నారు.  

Also read: Population Decline: జనాభా తగ్గుదల ఆందోళనకరం... ప్రపంచ దేశాల ముందు కొత్త సవాళ్లు

SAFF U17 Championships: ‘శాఫ్‌’ ఫుట్‌బాల్‌ చాంప్‌ భారత్‌ 

దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య  అండర్‌–17 సాకర్‌ చాంపియన్‌షిప్‌లో భారత అబ్బాయిలు టైటిల్‌ నిలబెట్టుకున్నారు. కొలంబోలో సెప్టెంబర్ 15న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ 4–0తో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. బాబి సింగ్‌ (18వ ని.), కొరవ్‌ సింగ్‌ (30వ ని.), కెపె్టన్‌ వాన్లల్‌పెక గీటే (63వ ని.), అమన్‌ (90+4వ ని.) తలా ఒక గోల్‌ చేసి భారత్‌ను విజేతగా నిలిపారు. 

Also read: 2022 World Wrestling Championships: రెండు పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు

Roger Federer Retires: టెన్నిస్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్విస్‌ స్టార్‌ 

ప్రపంచ టెన్నిస్‌ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. తన ఆటతో అభిమానులను అలరించి, ఆటను శాసించిన దిగ్గజ ప్లేయర్‌ రోజర్‌ ఫెడరర్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ నెల 23నుంచి 25 వరకు లండన్‌లో జరిగే లేవర్‌ కప్‌లో తాను చివరిసారిగా బరిలోకి దిగుతానని, ఆపై ప్రొఫెషనల్‌ టెన్నిస్‌నుంచి పూర్తిగా తప్పుకుంటానని అతను వెల్లడించాడు. 

Also read: 2022 World Wrestling Championships: రెండు పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు

1998లో ప్రొఫెషనల్‌గా మారిన ఈ స్విట్జర్లాండ్‌ స్టార్‌ 2021 జూలైలో చివరిసారిగా మ్యాచ్‌ ఆడాడు. వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్లో హ్యూబర్ట్‌ హర్కాజ్‌ (పోలండ్‌) చేతిలో 3–6, 6–7 (4/7), 0–6 తేడాతో ఓడిపోయాక మళ్లీ రాకెట్‌ పట్టుకోలేదు. 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన ఫెడరర్‌ కొన్నాళ్ల క్రితం వరకు అత్యధిక స్లామ్‌లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పుడు అతడిని నాదల్‌ (22), జొకోవిచ్‌ (21) అధిగమించారు.  

Also read: BCCI అధ్యక్ష, కార్యదర్శులు ఆరేళ్లపాటు పని చేయవచ్చు: సుప్రీం కోర్టు

కెరీర్‌ స్లామ్‌ పూర్తి
ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా అన్ని రకాల కోర్టుల్లో సత్తా చాటినా...ఫెడరర్‌ కెరీర్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఎప్పుడూ సవాల్‌గానే కనిపించింది. అప్పటికే 13 గ్రాండ్‌స్లామ్‌లు సాధించి ఫ్రెంచ్‌ ఓపెన్‌లోకి ఫెడరర్‌ అడుగు పెట్టాడు. మరో టైటిల్‌ గెలిస్తే ఆ సమయంలో అగ్ర స్థానంలో ఉన్న పీట్‌ సంప్రాస్‌ (14) రికార్డును సమం చేస్తాడు. అయితే ఎర్రమట్టిపై వరుసగా నాలుగేళ్లు టైటిల్‌ సాధించిన నాదల్‌ జోరు కొనసాగుతోంది. ఈ దశలో ఫెడరర్‌కు మళ్లీ కష్టమే అనిపించింది. అయితే క్వార్టర్‌ ఫైనల్లో సొదర్లింగ్‌ చేతిలో నాదల్‌ అనూహ్యంగా ఓడటంతో రోజర్‌కు దారులు తెరుచుకున్నాయి. ఈ అవకాశాన్ని వృథా చేయని అతను ఫైనల్లో సొదర్లింగ్‌నే ఓడించి తొలిసారి (ఏకైక) ఫ్రెంచ్‌ ఓపెన్‌ సాధించాడు. తన ‘కెరీర్‌ స్లామ్‌’ను పూర్తి చేసుకోవడంతో పాటు సంప్రాస్‌తో సమంగా నిలిచాడు. 

Also read: US Open 2022 Men's Singles: కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో పాటు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌నూ అందుకున్న స్పెయిన్‌ టీనేజర్‌

  • కెరీర్‌లో గెలిచిన మొత్తం టైటిల్స్‌ – 103  
  • గెలుపు–ఓటములు – 1251–275 
  • కెరీర్‌ ప్రైజ్‌మనీ – 13 కోట్ల డాలర్లు (సుమారు రూ.1042 కోట్లు) 
  • తొలిసారి వరల్డ్‌ నంబర్‌వన్‌ – 02/02/2004 
  • ఒలింపిక్‌ పతకాలు (2) – 2008 బీజింగ్‌లో డబుల్స్‌ స్వర్ణం, 2012 లండన్‌లో సింగిల్స్‌ కాంస్యం
  • వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ – మొత్తం 310 వారాలు        (ఇందులో వరుసగా 237 వారాలు)  
  • గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ విజయాల సంఖ్య – 369  
  • కెరీర్‌లో కొట్టిన ఏస్‌లు – 11,478 

Also read: Australia-Newzealand Series: ఆసీస్‌ క్లీన్‌స్వీప్‌.. Australia captain Aaron Finch వన్డే కెరీర్‌కు వీడ్కోలు

‘గ్రాండ్‌’ ఫెడెక్స్‌ 
ఆ్రస్టేలియా ఓపెన్‌ (6) – 2004, 2006, 2007, 2010, 2017, 2018 
ఫ్రెంచ్‌ ఓపెన్‌ (1) – 2009 
వింబుల్డన్‌ (8) – 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017 
యూఎస్‌ ఓపెన్‌ (5) – 2004, 2005, 2006, 2007, 2008 
తన కెరీర్‌ మొత్తంలో 1526 సింగిల్స్, 223 డబుల్స్‌ మ్యాచ్‌లు ఆడిన ఫెడరర్‌ ఒక్కసారి కూడా మ్యాచ్‌ మధ్యలో రిటైర్‌ కాలేదు.  

Also read: 2022 Diamond League: స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

ABC నూతన చైర్మన్‌గా ప్రతాప్‌ పవార్‌ 

ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ (ఏబీసీ) నూతన చైర్మన్‌గా ప్రతాప్‌ పవార్‌ ఎన్నికయ్యారు. మరాఠీ దినపత్రిక ‘సకల్‌’ను ప్రచురించే సకల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. 2022–23 సంవత్సరానికి గాను ఏబీసీ చైర్మన్‌గా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో మహ్రాత్తా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీస్‌ అండ్‌ అగ్రికల్చర్‌(పుణే) అధ్యక్షుడిగా సేవలందించారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ప్రతాప్‌ పవార్‌ను భారత ప్రభుత్వం 2014లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా శ్రీనివాసన్‌ కె.స్వామి ఎన్నికయ్యారు.   

Also read: Weekly Current Affairs (Persons) Bitbank: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?

SCO Summit 2022: సెప్టెంబర్ 16న SCO శిఖరాగ్ర సదస్సు 

 ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌ నగరంలో సెప్టెంబర్ 16న ప్రారంభం కానున్న షాంఘై కో–ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్‌ తదితర నేతలు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వ్యాపార–వాణిజ్యం, ఇంధన సరఫరా వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎస్సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ రష్యా అధినేత పుతిన్, ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షుడు షవ్‌కాత్‌ మిర్జీయోయెవ్‌తోపాటు ఇతర దేశాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై, ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అవుతారా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. 2001లో షాంఘైలో ఏర్పాటైన ఎస్సీఓలో చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, తైవాన్‌ జలసంధిలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఉజ్బెకిస్తాన్‌లో ఎస్సీఓ సదస్సు జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.   సదస్సులో ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గురువారం ఉజ్బెకిస్తాన్‌కు బయలుదేరడానికి ముందు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.  

Also read: S కాన్సుల్‌ జనరల్‌గా జెన్నీఫర్‌ లార్సన్‌

జిన్‌పింగ్, పుతిన్‌ సమావేశం    
చైనా, రష్యా అధినేతలు షీ జిన్‌పింగ్, పుతిన్‌ గురువారం సమర్‌ఖండ్‌లో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రష్యాకు జిన్‌పింగ్‌ మద్దతు ప్రకటించారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తామన్నారు.   సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌ సిటీకి చేరుకున్నారు. శుక్రవారం జరిగే సదస్సులో ఆయన పాలుపంచుకుంటారు.

Also read: Starbucks CEOగా లక్ష్మణ్‌ నరసింహన్‌ నియామకం  

Telangana Secretariat: సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు

నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు. 

Also read: Quiz of The Day (September 14, 2022): కుల వ్యవస్థ ఎప్పుడు ఉద్భవించింది?

ప్రజలందరికీ గర్వ కారణం
రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్‌కు అంబేడ్కర్‌ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘దేశ ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేడ్కర్‌ తాత్వికతను రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ స్వయంపాలన కొనసాగించడం వెనక అంబేడ్కర్‌ ఆశయాలు ఇమిడి ఉన్నాయి. అంబేడ్కర్‌ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్‌ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ ఏర్పాటైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అంబేడ్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తోంది’ అని సీఎం పేర్కొన్నారు. 

Also read: Telangana National Integration Day: సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం
 
జీవో జారీ చేసిన సీఎస్‌
కొత్త సచివాలయానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంగా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సెప్టెంబర్ 15న ఉత్తర్వులు జారీ చేశారు.

Also read: Weekly Current Affairs (Awards) Bitbank: ఏ పవర్ కంపెనీకి 'ఆసియా బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డ్-2022' అవార్డు లభించింది?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 16 Sep 2022 06:13PM

Photo Stories