Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 17th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu September 17th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu September 17th 2022
Current Affairs in Telugu September 17th 2022

Space Science Institute: సౌర వలయాలు 

ఫొటోల్లో కనిపిస్తున్నది సూర్యుని చుట్టూ ఏర్పడ్డ వెలుతురు వలయం (సన్‌ హాలో). రెండో ఫొటోలోది భూమ్మీద నుంచి కన్పిస్తున్నది కాగా, మొదటి ఫొటోలోనిదేమో అంగారకునిపై నుంచి కనిపించిన సన్‌ హాలో. అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను అన్వేషించే క్రమంలో పెర్సెవరెన్స్‌ రోవర్‌ ఈ అరుదైన దృగ్విషయాన్ని గత డిసెంబర్లో అనుకోకుండా క్లిక్‌మనిపించింది. 2021 డిసెంబర్‌ 15న వాటిని నాసాకు పంపింది. సన్‌ హాలో భూమి పై నుంచి తరచూ కనిపిస్తూనే ఉంటుంది గానీ అంగారకునిపై నుంచి కంటబడటం ఇదే తొలిసారని స్పేస్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్లానెటరీ సైంటిస్టు మార్క్‌ లేమన్‌ చెప్పారు. 2020లో నాసా ఈ రోవర్‌ను అంగారకునిపైకి పంపించడం తెలిసిందే. 

Also read: Quiz of The Day (September 16, 2022): ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?

ఏమిటీ సన్‌ హాలో...?
మేఘాల్లో అసంఖ్యాకమైన సూక్ష్మ మంచు స్ఫటికాలుంటాయి. కాంతి వాటి గుండా సాగే క్రమంలో అప్పడప్పుడూ విడిపోవడంతో పాటు వక్రీభవనం కూడా చెందుతుంటుంది. ఫలితంగా ఒక్కోసారి ఇంద్రధనుస్సును తలపించే కాంతి వలయాలు ఏర్పడతాయి. నిర్దిష్ట కోణం నుంచి చూసినప్పుడు ఇవి వృత్తాకారంలో కనువిందు చేస్తాయి. వాటిని సన్‌ హాలోగా పిలుస్తారు. ఇలా భూమ్మీది నుంచి కనిపించే వలయాలు సాధారణంగా 22 డిగ్రీల కోణంలో ఏర్పడేవి అయుంటాయని అమెరికాలోని ఇల్లినాయీ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. అయితే భూమితో పోలిస్తే అంగారకునిపై నీటి శాతం అత్యల్పం. అక్కడ అత్యధికంగా ఉండేది కార్బన్‌ డయాక్సైడే. కాబట్టి పెర్సెవరెన్స్‌ రోవర్‌ అందించిన ఫొటోలు నిజంగా సన్‌ హాలోకు సంబంధించినవేనా అని శాస్త్రవేత్తలు మీమాంసలో పడ్డారు. బహుశా రోవర్‌ తాలూకు కెమెరా కోణం వల్ల అలాంటి వెలుతురు వలయం ఏర్పడి ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. అయితే చివరికి ఇది దుమ్మూ ధూళి వల్ల ఏర్పడ్డది కాదని, సన్‌ హాలోయేనని తేల్చారు. 
– నేషనల్‌ డెస్క్, సాక్షి

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 15th కరెంట్‌ అఫైర్స్‌


SEO Summit 2022: అనుసంధానమే బలం SCO సభ్యదేశాలకు మోదీ పిలుపు  

 

సమర్‌ఖండ్‌: షాంఘై కో–ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సభ్యదేశాల నడుమ అనుసంధానం మరింత పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. లక్ష్యాల సాకారానికి మెరుగైన అనుసంధానం, రవాణా సదుపాయాల విషయంలో పరస్పరం పూర్తి హక్కులు కల్పించడం ముఖ్యమన్నారు. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌లో సెప్టెంబర్ 16న  SEO శిఖరాగ్ర సదస్సులో మోదీ మాట్లాడారు. కరోనా, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం దేశాలతో మధ్య రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇంధన, ఆహార కొరత ఏర్పడిందని గుర్తుచేశారు. అందుకే విశ్వసనీయమైన, ప్రభావవంతమైన, వైవిధ్యభరితమైన సప్లై చైన్లను అభివృద్ధికి సభ్యదేశాలన్నీ కృషి చేయాలన్నారు. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యధికంగా 7.5 శాతం వృద్ధి సాధించనున్నట్లు చెప్పారు. SCO సభ్యదేశాల మధ్య మరింత సహకారం, పరస్పర విశ్వాసానికి భారత్‌ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.  

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 16th కరెంట్‌ అఫైర్స్‌

తృణధాన్యాల సాగును ప్రోత్సహించాలి   
ప్రపంచదేశాల్లో ఆహార భద్రత సంక్షోభంలో పడిందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దీనికి ఆచరణీయ పరిష్కారముంది. తృణధాన్యాల సాగును, వినియోగాన్ని భారీగా ప్రోత్సహించాలి. తృణధాన్యాల సాగు వేల ఏళ్లుగా ఉన్నదే. ఇవి చౌకైన సంప్రదాయ పోషకాహారం. మిల్లెట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలి’’ అన్నారు.

Also read: Quiz of The Day (September 17, 2022): సీనియర్ సిటిజన్లకు అంకితమైన స్టార్టప్ గుడ్‌ఫెలోస్‌ను ఎవరు ఆవిష్కరించారు?

ప్రజలే కేంద్రంగా అభివృద్ధి మోడల్‌   
‘‘కరోనాతో ప్రపంచమంతటా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. అవి తిరిగి కోలుకోవడంలో ఎస్సీఓ పాత్ర కీలకం’’ అని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘ప్రపంచ జీడీపీలో ఎస్సీఓ వాటా 30 శాతం. జనాభాలో 40 శాతం’’ అన్నారు. తయారీ రంగంలో భారత్‌ను గ్లోబల్‌ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతిభావంతులైన యువత వల్ల ఇండియా సహజంగానే ప్రపంచదేశాలకు పోటీదారుగా ఎదుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 7.5 శాతం వృద్ధితో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అగ్రగామిగా ఎదగబోతున్నామని వివరించారు. టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించుకుంటున్నామని, తమ అభివృద్ధి మోడల్‌కు ప్రజలే కేంద్రమని తెలిపారు. ప్రతి రంగంలో నవీన ఆవిష్కరణలకు ఊతం ఇస్తున్నామని, ఇండియాలో ప్రస్తుతం 70,000కు పైగా స్టార్టప్‌లు పని చేస్తున్నాయని వెల్లడించారు. ఇందులో 100కు పైగా యూనికార్న్‌ కంపెనీలు ఉన్నాయన్నారు. ఇండియా సంపాదించిన అనుభవం ఎస్సీఓలోని ఇతర దేశాలు సైతం ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌పై ప్రత్యేక వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయడం ద్వారా తమ అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకుంటామని చెప్పారు. 

Also read: Wildlife: అంతరించిపోయిన వన్యప్రాణుల్ని పునరుద్ధరించే దిశగా.. నమీబియా నుంచి కునో నేషనల్‌కు చేరుకున్న చిరుతలు

ప్రపంచానికి భారత్‌ గమ్యస్థానం  
మెడికల్, వెల్‌నెస్‌ టూరిజంలో ప్రపంచానికి భారత్‌ గమ్యస్థానంగా మారిందని మోదీ అన్నారు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం తమదేశంలో పొందవచ్చని తెలిపారు.

Also read: I2I2: ‘ఐ2యూ2’ సానుకూల అజెండా.. భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు..

ఇక భారత్‌ సారథ్యం
రొటేషన్‌ విధానంలో భాగంగా ఎనిమిది మంది సభ్యుల ఎస్‌సీఓ సారథ్యం ఉజ్బెకిస్తాన్‌ నుంచి భారత్‌ చేతికి వచ్చింది. 2023లో ఎన్‌సీఓ శిఖరాగ్రానికి భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయంలో భారత్‌కు అన్నివిధాలా సహకరిస్తామని ఉజ్బెక్‌ అధ్యక్షుడు షౌకట్‌ మిర్జియోయెవ్‌ చెప్పారు. ఆయనతో కూడా మోదీ భేటీ అయ్యారు.

Also read: PGII scheme: జీ7 కూటమి పార్టనర్‌షిప్‌ ఫర్‌ గ్లోబల్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పథకం

యుద్ధాన్ని ముగించండి పుతిన్‌తో చర్చల్లో మోదీ సూచన 
సమకాలీన ప్రపంచంలో యుద్ధాలకు తావు లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు సూచించారు. ఎస్‌ఈఓ సదస్సు సందర్భంగా పుతిన్‌తో మోదీ చర్చలు జరిపారు. చర్చలు, దౌత్యాల ప్రాధాన్యతను నొక్కిచెప్పారు. ‘‘ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభం నేడు వర్ధమాన దేశాలకు అతి పెద్ద సమస్య. వీటికి వెంటనే పరిష్కారం కనిపెట్టేందుకు మీరు కృషి చేయాలి’’ అని పుతిన్‌కు సూచించారు. యుద్ధంపై భారత్‌ వైఖరిని, ఆందోళనను అర్థం చేసుకోగలనని పుతిన్‌ బదులిచ్చారు. దాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక మోదీ, పుతిన్‌ సమావేశమవడం ఇదే తొలిసారి. చర్చలు అద్భుతంగా సాగాయంటూ మోదీ ట్వీట్‌ చేశారు. ‘‘వర్తకం, ఇంధనం, రక్షణ వంటి పలు రంగల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించాం. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలూ చర్చకొచ్చాయి’’ అని వివరించారు. రష్యాతో బంధానికి భారత్‌ ఎంతో ప్రాధాన్యమిస్తుందని పునరుద్ఘాటించారు. శనివారంతో 72వ ఏట అడుగు పెడుతున్న మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రేపు నా ప్రియమిత్రుడు పుట్టిన రోజు జరుపుకోనున్నారు. రష్యా సంప్రదాయంలో ముందుగా శుభాకాంక్షలు చెప్పరు. అయినా మీకు, భారత్‌కు శుభాకాంక్షలు. మీ నేతృత్వంలో భారత్‌ మరింత అభవృద్ధి చెందాలి’’ అని ఆకాంక్షించారు.  గత డిసెంబర్లో తన భారత పర్యటన తాలూకు జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగన్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు. 

Also read: India Population: 2026వ సంవత్సరం తర్వాత 1% దిగువకు దేశ జనాభా వృద్ధి రేటు


U16 - World Youth Championship 2022:  భారత 76వ గ్రాండ్‌మాస్టర్‌గా ప్రణవ్‌ ఆనంద్‌ 

ఈ ఏడాది భారత్‌ నుంచి మరో కుర్రాడు చెస్‌లో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా సంపాదించాడు. బెంగళూరుకు చెందిన 15 ఏళ్ల ప్రణవ్‌ ఆనంద్‌ భారత్‌ నుంచి గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కించుకున్న 76వ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. రొమేనియాలో జరుగుతున్న ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌లో అండర్‌–16 విభాగంలో టైటిల్‌ సాధించిన ప్రణవ్‌ 2500 ఎలో రేటింగ్‌ మైలురాయిని కూడా దాటాడు. దాంతో అతనికి జీఎం హోదా ఖరారైంది. నిబంధనల ప్రకారం జీఎం హోదా లభించాలంటే మూడు జీఎం నార్మ్‌లు సంపాదించడంతోపాటు 2500 ఎలో రేటింగ్‌ పాయింట్లు ఉండాలి. గత జూలైలో స్విట్జర్లాండ్‌లో జరిగిన బీల్‌ చెస్‌ ఫెస్టివల్‌లో ప్రణవ్‌ మూడో జీఎం నార్మ్‌ సాధించాడు. 

ఈ సంవత్సరం భరత్‌ సుబ్రమణియమ్‌ (తమిళనాడు), రాహుల్‌ శ్రీవత్సవ్‌ (తెలంగాణ), ప్రణవ్‌     వెంకటేశ్‌ (తమిళనాడు) జీఎం హోదా సాధించారు.

Also read: Roger Federer Retires: టెన్నిస్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్విస్‌ స్టార్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 17 Sep 2022 04:14PM

Photo Stories