Rare ‘Flesh-Eating Bacteria’: దడ పుట్టిస్తున్న కొత్త బ్యాక్టీరియా.. సోకితే రెండు రోజుల్లో మృతి?
జపాన్‌లో కరోనా పీరియడ్ ఆంక్షలు సడలించిన అనంతరం ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. వైద్యుల అంచనా ప్రకారం ఈ వ్యాధి మనిషిని 48 గంటల్లో మృత్యు ఒడికి చేరుస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధిని ‘స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్’ (ఎస్‌టీఎస్‌ఎస్) అని అంటారు.
జపాన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తెలిపిన వివరాల ప్రకారం 2024, జూన్ 2 నాటికి ఈ వ్యాధి కేసులు 977కి చేరుకున్నాయి. గతేడాది 941 కేసులు నమోదయ్యాయి. ఈ ఇన్స్టిట్యూట్ 1999 నుంచి ఈ వ్యాధికి సంబంధించిన రికార్డులను భద్రపరుస్తోంది.
చదవండి: Health Diseases: 2023లో మెరుగైన ఐదు వ్యాధులు.. 2024లో జాగ్రత్తలు!
ఈ వ్యాధి సోకినప్పుడు గొంతు నొప్పి మొదలవుతుంది. అలాగే శరీరంలోని వివిధ అవయవాల్లో వాపు, నొప్పి జ్వరం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇది శ్వాస సమస్యలు, అవయవ వైఫల్యానికి దారితీసి చివరికి బాధితుడిని మృత్యు ఒడికి చేరుస్తుంది. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం అధికంగా ఉంటున్నదని పలు పరిశోధనల్లో తేలింది.
ఈ వ్యాధి గురించి టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన అంటు వ్యాధుల ప్రొఫెసర్ కెన్ కికుచి మాట్లాడుతూ ఈ వ్యాధి సోకినప్పుడు మరణం 48 గంటల్లో సంభవించే అవకాశం ఉన్నదన్నారు. జపాన్‌లో ఈ ఏడాది చివరినాటికి ఈ కేసుల సంఖ్య 2,500కి చేరుకోవచ్చని కికుచి తెలిపారు.
Tags
- Rare flesh-eating bacteria
- Japan
- COVID-19
- Daily Current Affairs
- Science and Technology General Knowledge
- GK General Knowledge 2024
- India Current Affairs
- Today English News on GK
- June 2024 Current Affairs
- Rare disease
- Bacteria
- Medical experts
- Fatal
- Rapid spread
- infection
- Health crisis
- SakshiEducationUpdates
- International news