Current Affairs: మార్చి 28వ తేదీ ముఖ్యమైన టాప్ 10 కరెంట్ అఫైర్స్ ఇవే!
1. గగన్‌యాన్ సిబ్బందికి సహాయం చేయడానికి ఇస్రో ఏ యాప్‌ను ప్రారంభించింది?
జ:- సఖి (SAKHI)
2. భారత సైన్యం ఏ నగరంలో మొదటి అపాచీ స్క్వాడ్రన్‌ను ఏర్పాటు చేసింది?
జ:- జోధ్‌పూర్.
3. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 ప్రకారం, ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది?
జ:- ఫిన్లాండ్.
4. అత్యంత కాలుష్య నగరాల ప్రపంచ జాబితాలో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది?
జ:- బెగుసరాయ్.
5. 21 మార్చి 2024న ప్రపంచవ్యాప్తంగా ఏ రోజును జరుపుకుంటారు?
జ:- వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే.
6. వ్యవస్థలో మార్పు కోసం త్రినేత్ర యాప్ 2.0ని ఏ రాష్ట్ర పోలీసులు ఆవిష్కరించారు?
జ:- ఉత్తర ప్రదేశ్.
7. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత?
జ:- 126.
8. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగించారు?
జ:- సీపీ రాధాకృష్ణన్.
9. ఎన్నికల సంఘం 'మిషన్ 414' ప్రచారాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది?
జ:- హిమాచల్ ప్రదేశ్.
10. పారిస్ ఒలింపిక్స్ కోసం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది?
జ:- యస్ బ్యాంక్.