Skip to main content

India Population: 2026వ సంవత్సరం తర్వాత 1% దిగువకు దేశ జనాభా వృద్ధి రేటు

the projected population in india 2026

దేశ జనాభా వార్షిక వృద్ధి రేటు 2026 తర్వాత 0.9%కి పడిపోనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన 'ఇండియాస్‌ విజన్‌ ఫ్యామిలీ ప్లానింగ్‌ 2030' నివేదిక పేర్కొంది. 2011-16 మధ్యలో 1.6% మేర ఉన్న వృద్ధి రేటు.. 2016 - 21 మధ్య కాలంలో 1.4%కి.. 2021-26 మధ్యకాలంలో 1.1%కి తగ్గిందని తెలిపింది. 2026 - 31 మధ్యకాలంలో ఇది 0.9%కి.. 2031 - 36 మధ్యలో 0.7%కి పడిపోనుందని తెలిపింది. 2011-36 మధ్యకాలంలో 31 కోట్ల మంది జనాభా కేవలం యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్‌ నుంచే జత కలుస్తారని పేర్కొంది. మొత్తం వృద్ధిలో ఈ ఆరు రాష్ట్రాల వాటా 64% మేర ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సంతానసాఫల్య నిష్పత్తి తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించింది. ఆధునిక కుటుంబ నియంత్రణ విధానం అనుసరించే వారు 1992-93 నుంచి 2019-21 మధ్య కాలంలో 36.5% నుంచి 56.5%కి పెరిగారని.. దీనివల్ల అదే సమయంలో సంతాన సాఫల్య నిష్పత్తి 3.4 నుంచి 2కి తగ్గిపోయిందని ఈ నివేదిక వెల్లడించింది.

చ‌ద‌వండి:  Weekly Current Affairs (International) Bitbank: బ్రిక్స్ గ్రూపింగ్‌లో చేరడానికి ఏ రెండు దేశాలు దరఖాస్తు చేసుకున్నాయి?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 09 Aug 2022 06:42PM

Photo Stories