Skip to main content

Interesting Facts About Cheetahs : చీతా.. అరుదైన ఈ వన్యప్రాణి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు.. ఎందుకంటే..?

చీతా.. ఈ భూమ్మీద అత్యంత వేగంతో పరిగెత్తే జంతువు. తేలికగా ఉండే శరీర తత్వంతో.. పొడవాటి తోక, సన్నని పొడవైన కాళ్లతో మెరుగు వేగంతో దూసుకుపోయే తత్వం చీతాది.
most interesting facts about cheetahs
very interesting facts about cheetahs

అదే టైంలో ఆ చూడ ముచ్చటైన స్వభావమే దాని పాలిట శాపంగా మారింది. ఆల్రెడీ భారత్‌లో అంతరించిన ఈ జాతిని తిరిగి పునరుద్ధరించేందుకు చీతా ప్రాజెక్టు చేపట్టారు. నమీబియా నుంచి తెచ్చిన ఎనిమిది చీతాలను కునో నేషనల్‌ పార్క్‌(ఎంపీ)లోకి వదిలారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా అరుదైన ఈ వన్యప్రాణి చీతా ప్ర‌త్యేక‌త‌లు మీకోసం..

➤ చీతా అనే పదం.. హిందుస్థానీ నుంచి పుట్టింది. సంస్కృతంలో దీనర్థం చిత్ర..యా అంటే రంగురంగులది అని. 

➤ చీతాలు నాలుగు ఉపజాతులుగా ఇప్పుడు ఈ భూమ్మీద ఉన్నాయి. సౌతాఫ్రికన్‌ చీతాలు, ఆసియాటిక్‌ చీతాలు, నార్త్‌ఈస్ట్‌ ఆఫ్రికన్‌ చీతాలు, నార్త్‌వెస్ట్‌ ఆఫ్రికన్‌ చీతాలు.

cheetahs

➤ చీతా వేట నిమిషం కంటే వ్యవధిలోనే ముగస్తుంటుంది సాధారణంగా. ఒక దూకుతో వేటను పట్టేస్తుంది. ఇది ఎంతలా అంటే.. స్పోర్ట్స్‌ కారు కంటే వేగంగా..!

☛ NTCA: 2021లో దేశవ్యాప్తంగా మరణించిన పులుల సంఖ్య?

➤ పిల్లి జాతి వన్యప్రాణుల్లో చీతాలది ఒక ప్రత్యేకమైన జీవనం. మగవన్నీ కలిసి జీవిస్తే.. ఆడ చీతలు మాత్రం ఒంటరిగా కూనలను పెంచుతాయి. పగలంతా వాటిని దాచేసి..  ఎలా వేటాడో నేర్పిస్తాయి. ఇక మగవన్నీ ఒక జట్టుగా ఉండి తమ సరిహద్దుల్ని కాపాడుకోవడంతో పాటు వేటను వెంటాడుతాయి.

cheetahs Details

➤ చీతలకు ఉన్న మరో ప్రత్యేకత పగటి పూట వేట. పొద్దుపొద్దునే.. లేదంటే మిట్టమధ్యాహ్నాం అవి బరిలో దిగుతాయి. సూర్యుడి కాంతి కంటి మీద పడినా.. కళ్లు రెప్పవాల్చకుండా వేటాడుతాయి అవి. తద్వారా సింహం, హైనాల లాంటి పోటీ నుంచి అవి ఊరట దక్కించుకుంటాయి. 

➤ చీతా గర్జిస్తుందని పొరబడేరు.. పాపం దాని గొంతులో ఉన్న ప్రత్యేకత వల్ల (రెండు భాగాల బోన్‌) అది గర్జించలేదు. బదులుగా.. పిల్లిలాగా మియావ్‌ అని లేదంటే షిష్‌.. అంటూ విచిత్రమైన అరుపులు చేస్తుంది.

cheetahs news

 ➤ చీతాను ఒకప్పుడు ఈజిప్ట్‌లో పరమ పవిత్రంగా, రాజసంగా భావించేవాళ్లు. ఫారోల సమాధులు, ఇతర కట్టడాలపై వాటికి ఉన్న ప్రాధాన్యతే ఆ విషయాన్ని తెలియజేస్తుంది.

☛ చ‌ద‌వండి: భార‌త్‌లో మొత్తం పులుల సంఖ్య‌?

➤ చీతాలు తమ సరిహద్దులు ఎక్కువగా ఉండాలని అనుకుంటాయి. కానీ, మనుషుల తాకిడితో వాటి సరిహద్దులు చెరిగిపోయి.. అంతరించే దశకు చేరుకున్నాయి.

➤ సింహాలు తప్ప మిగతా జాతులన్నీ విడిగానే జీవిస్తాయి. కానీ, చీతాలు మాత్రం గుంపునే ఇష్టపడతాయి. సింహాల మాదిరే నీళ్లు కూడా తక్కువగా తాగుతాయి చీతాలు.

cheetahs top 10 facts

ఫాస్ట్‌ ఫుడ్‌ ఇష్టం.. ఎందుకంటే..?
చీతాలకు త్వరగా దొరికే ఆహారం అంటే ఇష్టం. అందుకే కుందేళ్లను, జింకలను వేటాడుతాయి. పెద్ద వాటి జోలికి ఎక్కువగా పోవు. పైగా ఇతర జంతువుల బెడదను దృష్టిలో పెట్టుకుని త్వరగా తినేస్తాయి కూడా. 

☛ పులుల గణన నివేదిక విడుదల

➤ చీతాలకు వాటి లుక్కే ప్రధాన ఆకర్షణ. అందుకే వాటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో.. తల్లి చీతాలకు చంపి.. కూనలను అక్రమ రవాణా చేస్తుంటారు. ముఖ్యంగా అరేబియన్‌ గల్ప్‌ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. అందుకే వీటి వేటను అణచివేసేందుకు ఆఫ్రికా, ఇరాన్‌ లాంటి ఆసియా దేశం కఠినచట్టాలు అమలు చేస్తున్నాయి.

నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా..

cheetahs and modi


ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మరో చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. చీతా ప్రాజక్టులో భాగంగా..  నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను సెప్టెంబ‌ర్ 17వ తేదీన (శనివారం) ఉదయం ప్రధాని మోదీ స్వయంగా మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌ కునో నేషనల్‌ పార్క్‌లోకి విడుదల చేశారు. 

74 ఏళ్ల తర్వాత..

cheetahs after 75 years

సుమారు 74 ఏళ్ల తర్వాత అరుదైన వన్యప్రాణులైన చీతాలు భారత్‌లో అడుగుపెట్టాయి. మొత్తం ఎనిమిది చీతాలను ప్రత్యేక పరిస్థితుల నడుమ భారత్‌కు తీసుకొచ్చారు. వాటిని నమీబియా పరిస్థితులకు దగ్గరగా ఉండే షియోపూర్‌ ప్రాంతంలో కునో నేషనల్‌ పార్క్‌లో విడిచిపెట్టారు.

చీతా ప్రాజెక్టులో భాగంగా.. నమీబియా నుంచి ప్రత్యేక కార్గో బోయింగ్‌ విమానంలో వాటిని గ్వాలియర్‌లోని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో దించారు. ఆ చీతాలను వైమానిక విమానంలో కునో నేషనల్‌ పారర్క్కు తరలించారు. ఈ చిరుతల్లో ఐదు ఆడ చిరుతలు.. రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసుస్సు గలవి, మూడు మగ చిరుతలు 4 నుంచి 5 ఏళ్ల మధ్య వయసు గలవి ఉన్నాయి.

1952 నాటికి ఈ జాతులు..

cheetahs in india

భారత్‌  గతంలో ఆసియాటిక్‌ చిరుతలకు నిలయంగా ఉంది. ఐతే 1952 నాటికి ఈ జాతులు అంతరించిపోయాయి. ప్రాజెక్ట్‌ చీతా అనే ఖండాంతర ట్రాన్స్‌లోకేషన్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ చిరుతలను నమీబియా నుంచి భారత్‌కి తీసుకువస్తున్నారు. ఇది ప్రపంచంలోనే తొలి అంతర్‌ ఖండాంతర భారీ వైల్డ్‌ మాంసాహార ట్రాన్స్‌ లోకేషన్‌ ప్రాజెక్ట్‌ అని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

☛ జూలై 29న‌ అంతర్జాతీయ టైగర్ దినోత్సవం

ఈ చిరుతలు భారత్‌లోని ఓపెన్‌ ఫారెస్ట్‌ గడ్డి భూములు, పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణలో సహాయపడతాయని పేర్కొంది. అంతేగాదు ఇది జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి, నీటి భద్రత, కార్బన్‌ సీక్వెస్ట్రేషన్‌, నేల తేమ సంరక్షణ వంటి పర్యావరణ వ్యవస్థ సేవలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని వెల్లడించింది.

☛ భారత్‌కు అరుదైన ఆఫ్రికా చిరుతలు

Published date : 17 Sep 2022 04:33PM

Photo Stories