NTCA: 2021లో దేశవ్యాప్తంగా మరణించిన పులుల సంఖ్య?
Sakshi Education
దేశవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా 2021 ఏడాదిలో గణనీయ సంఖ్యలో పులులు మృత్యువాత పడ్డాయి. జాతీయ పులుల పరిరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ) వెల్లడించిన లెక్కల ప్రకారం...
- 2021 ఏడాదిలోనే 126 పులులు వివిధ కారణాలతో చనిపోయాయి. 2020 ఏడాదిలో 106 పులులు మరణించాయి.
- 2016లో 121 పులులు మృత్యువాత పడటమే ఇప్పటివరకు గరిష్టంగా ఉండగా, 2021 ఏడాదిలో పులుల మరణాలు ఆ మార్కును దాటేశాయి.
- 2021 ఏడాది పులుల మరణాలు అధికంగా మధ్యప్రదేశ్‌లో 44, మహారాష్ట్రలో 26, కర్ణాటకలో 14, తెలంగాణలో 4 , ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి ఉన్నాయి.
- 2012 నుంచి 2020 వరకు దేశవ్యాప్తంగా మొత్తంగా 877 పులులు మరణించగా, ఇందులో అధికంగా మధ్యప్రదేశ్‌లోనే 202 మరణాలు ఉన్నాయి.
- 2012 నుంచి 2020 వరకు తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్‌లో 8 పులులు మరణించాయి.
- చనిపోయిన పులుల్లో 55.78% టైగర్ రిజర్వ్‌లోనూ, మరో 31.62% రిజర్వ్ సరిహద్దులకు బయట చనిపోయాయి.
- పులుల మరణాలకు సంబంధించి 88.91% కేసులు పరిష్కారమయ్యాయి.
చదవండి: భారత్‌లో మొత్తం పులుల సంఖ్య?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 ఏడాదిలో గణనీయ సంఖ్యలో 126 పులులు మృత్యువాత పడ్డాయి.
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : జాతీయ పులుల పరిరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ)
ఎక్కడ : దేశవ్యాప్తంగా..
ఎందుకు : వివిధ కారణాలతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Published date : 01 Jan 2022 01:40PM