భారత్‌కు అరుదైన ఆఫ్రికా చిరుతలు
Sakshi Education
అరుదైన ఆఫ్రికా చిరుతలను భారత్‌కు తీసుకొచ్చి.. అవి జీవించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.
భారత్‌లో చిరుతలు అంతరించిపోతున్న నేపథ్యంలో నమీబియా నుంచి చిరుతలు తీసుకుని వచ్చేందుకు, మనదేశంలోనే దానికి తగిన ఆవాసం కల్పించేందుకు అనుమతించాలంటూ జాతీయ పులుల సంరక్షణ సంస్థ(ఎన్టీసీఏ) సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ఆఫ్రికా చిరుతలను తీసుకురావడంలో మార్గనిర్దేశం చేసేందుకు జనవరి 28న ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ చిరుతల ఆవాసానికి అనువైన ప్రదేశంపై కమిటీ సర్వే చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌కు అరుదైన ఆఫ్రికా చిరుతలు
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : భారత్‌లో చిరుతలు అంతరించిపోతున్న నేపథ్యంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌కు అరుదైన ఆఫ్రికా చిరుతలు
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : భారత్‌లో చిరుతలు అంతరించిపోతున్న నేపథ్యంలో
Published date : 29 Jan 2020 06:03PM