Skip to main content

పులుల గణన నివేదిక విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న పులుల గణన నివేదిక ‘అఖిల భారత పులుల సంఖ్య అంచనా-2018’ను ప్రధాని నరేంద్ర మోదీ <b>ప్రపంచ పులుల దినోత్సవమైన జూలై 29న</b> విడుదల(2019, జూలై 29) చేశారు.

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ), జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ) కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.

నివేదిక ప్రకారం పులుల సంఖ్య సంవత్సరాల వారీగా...

2006

2010

2014

2018

1,411

1,706

2,226

2,967


పులులు అధికంగా ఉన్న రాష్ట్రాలు

 

1. మధ్యప్రదేశ్

526

2. కర్ణాటక

524

3. ఉత్తరాఖండ్

442

4. మహారాష్ట్ర

312

5. తమిళనాడు

264


పులుల గణన నివేదికలోని అంశాలు...

 

 

  • దేశంలోనే అత్యధిక సంఖ్యలో పులులు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 2014లో 308గా ఉన్న పులుల సంఖ్య 2018కి ఏకంగా 526కి పెరిగింది.
  • మహారాష్ట్రలోనూ 2014లో 190 పులులు ఉండగా, 2018లో 312 ఉన్నాయి.
  • 2014 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 68 పులులు ఉన్నాయి.
  •  2018 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 48 పులులు ఉన్నాయి.
  • తెలంగాణలో ఆమ్రాబాద్, కవ్వాల్‌ల్లో పులుల సంరక్షణ కేంద్రాలుండగా, ఈ రెండింటిలో కలిపి 2014లో 20 పులులు ఉండేవి. 2018 నాటికి ఆ సంఖ్య 26కు పెరిగింది.
  • పులుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం తగ్గింది. ఛత్తీస్‌గఢ్‌లో 2014లో 46 పులులు ఉండగా, 2018కి వాటి సంఖ్య 19కి పడిపోయింది.
  • 2014లో దేశంలో సంరక్షణ ప్రాంతాలు 692 ఉండగా, ప్రస్తుతం 860కి పెరిగింది.
  • ఎం-స్ట్రైప్స్ అనే మొబైల్ యాప్ సాయంతో పులుల సంఖ్యను లెక్కించడం జరిగింది.
  • పులి పిల్లలను లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఎదిగిన పులులను మాత్రమే లెక్కించడం జరిగింది.


సర్వే సాగిందిలా...
సర్వే చేసిన అటవీ విస్తీర్ణం - 3,81,400 చదరపు కిలో మీటర్లు.
ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లు - 27,000
తీసిన ఫొటోలు - 3.48 కోట్లు
పులులు కనిపించిన ఫొటోలు - 77,000
పులుల జాడలను గుర్తించేందుకు సిబ్బంది నడిచిన దూరం - 5,22,996 కిలో మీటర్లు
సమాచారం సేకరించిన అటవీ డివిజన్లు - 491
పులుల గణనలో పాల్గొన్న సిబ్బంది సంఖ్య - 44,000

నాలుగేళ్ల ముందే రెట్టింపు చేశాం
పులులు గణన నివేదిక విడుదల సందర్భంగా మోదీ మాట్లాడుతూ ‘పులుల సంఖ్యను పెంచడంపై 9 ఏళ్ల క్రితం రష్యాలోని సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ స్థాయి సమావేశం జరిగింది. 2022 నాటికల్లా పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆ సమావేశంలో పాల్గొన్న దేశాలన్నీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. గడువు పూర్తవ్వడానికి నాలుగేళ్ల ముందే భారత్‌లో పులుల సంఖ్యను మనం రెట్టింపు చేశాం. సంకల్పంతో మనం దేన్నయినా సాధించవచ్చు అనడానికి ఇదే ఉదాహరణ’ అని వెల్లడించారు.

 

Published date : 01 Jan 2022 01:33PM

Photo Stories