Skip to main content

India's economy: భారత్‌ వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం: ఫిచ్‌ అంచనా తగ్గింపు

భారత్‌ ఎకానమీ వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పరిమితం అవుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ– ఫిచ్‌ అంచనావేసింది.
Fitch cuts India growth to 7% for 2022-23
Fitch cuts India growth to 7% for 2022-23

ఈ మేరకు జూన్‌లో వేసిన తొలి 7.8 శాతం వృద్ధి అంచనాలకు 80 బేసిస్‌ పాయింట్లు లేదా 0.80 శాతం (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) కోతపెట్టింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు,  ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు తమ తాజా అంచనాలకు కారణంగా చూపింది. 

2023–24 ఆర్థిక సంవత్సరం తొలి అంచనా 7.4 శాతాన్ని తాజాగా 6.7 శాతానికి కుదిస్తున్నట్లు కూడా ఫిచ్‌ తాజా గ్లోబల్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ పేర్కొంది. కాగా, 2022లో ప్రపంచ వృద్ధి రేటు 2.4 శాతానికి పరిమితం అవుతుందని ఫిచ్‌ పేర్కొంది. తొలి అంచనాలకన్నా ఇది అరశాతం (0.5 శాతం) తక్కువ.  

Also read: Satavahana History Important Bitbank in Telugu: శాతవాహనుల రాజభాష ఏది?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 16 Sep 2022 05:42PM

Photo Stories